నటసింహం బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable S4) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హాజరై పలు విశేషాలను బాలయ్యతో పంచుకున్నారు. తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్(Venaktesh) పాల్గొన్నారు. వెంకీ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా ప్రచారంలో భాగంగా అన్ స్టాపబుల్ సెట్స్‌లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడితో సందడి చేశారు.
కాగా ‘సంక్రాంతి హీరోల’ పేరుతో ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ‘ మనం ఒకరికొకరం పోటీనా’ అని బాలయ్య ప్రశ్నించగా ఎక్కడమ్మా పోటీ అని వెంకీ బదులిచ్చారు. ఇక ఈ ఎపిసోడ్‌లో వెంకటేష్ అన్నయ్య, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా పాలొన్నారు. ప్రోమో ఆద్యంతం నవ్వులతో సరదా సంభాషణలతో సాగింది. ఈనెల 27న రాత్రి 7:00 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదల కానున్నాయి.