నటసింహం బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable S4) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేశ్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, డాకు మహారాజ్ టీం సభ్యులు హాజరై పలు విశేషాలను బాలయ్యతో పంచుకున్నారు.
తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కొత్త ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రచారంలో భాగంగా అన్ స్టాపబుల్ సెట్స్‌లో చెర్రీ సందడి చేశారు. చరణ్‌తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ స్నేహితుడు విక్కీ కూడా సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇందులో చరణ్ అమ్మ, నాయనమ్మ మాట్లాడుతూ 2025లో మాకు ఒక మనవడు కావాలి అని కోరుతున్న వీడియో బైట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో దిల్ రాజు తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి నవ్వించాడు. చివరగా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)తో రామ్ చరణ్ ఫోన్ కాల్ హైలెట్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్ జనవరి 8వ తేదీ రాత్రి 7గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.