upasana konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలను చేపట్టింది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ని ప్రకటించింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసింది. ఈ స్పోర్ట్స్ హబ్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్‌కు ఉపాసన కొణిదెల కో ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త సంజీవ్ గొయేంకా ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.
కపిల్‌దేవ్, పుల్లెల గోపీచంద్…
స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డు సభ్యులుగా సైన్ రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్, టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో పాటు పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, అభినవ్ బింద్ర, రవికాంత్ రెడ్డి ఉన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలతో పాటు తమ క్రీడా నైపుణ్యంతో దేశానికి వన్నెతెచ్చిన దిగ్గజ ఆటగాళ్లకు ఈ బోర్డ్‌లో చోటు కల్పించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది.
Also Read – Suicide: రాక్షసుడిలా మారిన భర్త.. పెళ్ళైన ఆరు నెలలకే దారుణం!
శక్తివంతమైన అడుగు…
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్‌కు తనను కో ఛైర్మన్‌గా నియమించిన తెలంగాణ ప్రభుత్వానికి ఉపానన కొణిదెల కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి శక్తివంతమైన అడుగుపడినట్లు ఉపాసన చెప్పింది. సంజీవ్ గొయేంకాతో కలిసి పనిచేసే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. తనను కో ఛైర్మన్‌గా నియమించిన సీఏం రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ తన ట్వీట్‌లో ఉపాసన పేర్కొన్నది. ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సామాజిక సేవలో…
ఓ వైపు అపోలో హాస్పిటల్స్‌కు వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తూనే యూఆర్‌లైఫ్ పేరుతో సొంతంగా ఓ సంస్థను ప్రారంభించింది ఉపాసన. మరోవైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సామాజిక సేవలో ముందండటమే కాకుండా మహిళల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తరచుగా తన గళాన్ని వినిపిస్తుంటుంది. 2023లో రామ్‌చరణ్, ఉపాసన తల్లిదండ్రులుగా మారారు. వారికి కుమార్తె జన్మించింది. కూతురికి క్లీంకారా అనే పేరు పెట్టారు.
Also Read – Mole Astrology: అక్కడ పుట్టుమచ్చలుంటే.. మీరు అదృష్టవంతులే..!


