గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు గురువారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు పెద్ద ఎత్తున చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతేకాకుండా కుటుంబసభ్యులు కూడా చెర్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన(Upasana) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మార్చి 27 ఎప్పటికీ సంతోషకరమైన రోజు. మీరంతా విచ్చేసి ఈ రోజును మరింత ప్రత్యేకం చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, సుస్మితలతో రామ్‌చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. అలాగే మరో ఫొటోలో చిరంజీవి, నాగార్జునతో పాటు సన్నిహితులు, స్నేహితులు కూడా ఉన్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే చిత్రంలో నటిస్తున్నారు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. చెర్రీ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.