Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. మహిళా హక్కులపై తన వాయిస్‌ను వినిపించడంలో ముందుంటుంది ఉపాసన. వృత్తి పరంగా, ఫ్యామిలీ పరంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తరచుగా రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది ఉపాసన. ఫైండ్ యువర్ రామ్ పేరుతో ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మూఢనమ్మకాలు…
పెళ్లితో చాలా మంది మహిళల జీవితాలు ఇంటికే పరిమితమైపోతుండటం బాధాకరం. మూఢనమ్మకాలు, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, ఒత్తిడుల కారణంగా ఎంతో మంది నాలుగు గోడలు దాటి బయటకు అడుగుపెట్టలేకపోతున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి తర్వాత కూడా తమ చుట్టూ ఉన్న పురుషుల కంటే గొప్ప విజయాలను సాధిస్తున్నారు. పురుషుల సాయం లేకుండా తమ ఆలోచనలు అభిప్రాయాలకు అనుగుణంగా పిల్లలను పెంచుతున్నారు.
Also Read – Tollywood Heroine: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంట్లో ఈడీ సోదాలు – కారణం ఏమిటంటే?
ఆలోచన విధానం మారాలి…
పెళ్లి బంధం అన్నది ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి గౌరవమిస్తూ విలువనిచ్చే భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యం. ఈ విషయంలో మహిళల ఆలోచన విధానం మారాలి.
కుటుంబ సమస్యల వల్లే…
ఇండియాలో గత కొన్నేళ్లుగా జరుగుతోన్న నేరాల్లో మూడో వంతు వాటికి కుటుంబ సమస్యలే కారణమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతున్నాయి. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ లెక్కలు ద్వారా అర్థమవుతుంది. సరైన భాగస్వామి జీవితంలోకి వచ్చినప్పుడే మహిళల జీవితం బాగుంటుంది. మంచి కుటుంబాన్ని నిర్మించుకునే అవకాశం వారికి దొరుకుతుంది. గౌరవ ప్రదమైన కుటుంబాల వల్లే మంచి సమాజం, మంచి దేశాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది.
Also Read – Manchu Manoj: నేపో కిడ్స్‌పై మంచు మనోజ్ కామెంట్స్ వైరల్
డబ్బు కోసం…
సమాజ ఒత్తిడుల వల్లో.. డబ్బు కోసమో ఆలోచించి పెళ్లిళ్లు చేసుకోవద్దు. బలవంతంగా ఏర్పడే బంధాలు నిలబడవు. అమ్మాయిలు ఆనందంగా, స్వేచ్ఛగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేలా చూసుకోవాలి. సరైన భాగస్వామి దొరికే వరకు వేచిచూడటం తప్పేం కాదు. మిమ్మల్ని గౌరవించి మీ వ్యక్తిత్వానికి విలువనివ్వడమే కాకుండా అన్ని విషయాలలో మీకు అండదండలు అందించే భాగస్వామి దొరికే వరకు వివాహం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఈ పోస్ట్‌లో ఉపాసన కొణిదెల పేర్కొన్నారు.


