Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభUpasana Konidela: ఢిల్లీ సీఏంతో బ‌తుక‌మ్మ ఆడిన మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల‌ - ఫొటోలు...

Upasana Konidela: ఢిల్లీ సీఏంతో బ‌తుక‌మ్మ ఆడిన మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల‌ – ఫొటోలు వైర‌ల్‌

Upasana Konidela: మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల బతుక‌మ్మ సంబ‌రాల్లో భాగ‌మైంది. విద్యార్థుల‌తో క‌లిసి బతుకమ్మ ఆడింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఢిల్లీలో ఓ తెలుగు కాలేజీలో జ‌రిగిన బ‌తుక‌మ్మ సెల‌బ్రేష‌న్స్‌కు ఢిల్లీ సీఏం రేఖా గుప్తా క‌లిసి ఉపాస‌న కొణిదెల చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైంది. విద్యార్థుల‌తో సీఏం రేఖా గుప్తా, ఉపాస‌న కొణిదెల బ‌తుక‌మ్మ ఆడారు. బ‌తుక‌మ్మ‌ను నెత్తిన ఎత్తుకొని సంబ‌రాల్లో పాలు పంచుకున్నారు. సీఏం రేఖా గుప్తాతో ఉపాస‌న కొణిదెల బ‌తుక‌మ్మ ఆడుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -

సంప్ర‌దాయ వేడుక‌…
ఈ బ‌తుక‌మ్మ సెల‌బ్రేష‌న్స్ తాలూకు ఫొటోల‌ను సీఏం రేఖా గుప్తా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. తెలంగాణ మ‌హిళ‌లు త‌ర‌త‌రాలుగా జ‌రుపుకుంటున్న ఈ సంప్ర‌దాయ వేడుక‌లో భాగం కావ‌డం ఆనందంగా ఉంద‌ని సీఏం పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు స్టూడెంట్స్‌తో బ‌తుక‌మ్మ వేడుక‌లు జ‌రుపుకోవ‌డం రాష్ట్రాల మ‌ధ్య సాంస్కృతిక బంధాన్ని బ‌ల‌ప‌రుస్తుంది అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఢిల్లీ సీఏం రేఖా గుప్తా పేర్కొన్నారు. సీఏం పోస్ట్‌కు ఉపాస‌న రిప్లై ఇచ్చారు. బ‌తుక‌మ్మ సెల‌బ్రేష‌న్స్‌లో పాలుపంచుకున్న ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Also Read- Tamilnadu Rally Stampede: తీవ్ర దిగ్భ్రాంతికి లోన‌య్యా.. క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించిన చిరంజీవి

స్పోర్ట్స్ హ‌బ్ కో ఛైర్మ‌న్‌గా…
ఓవైపు కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూనే బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది ఉపాస‌న కొణిదెల. అపోలో హాస్పిట‌ల్స్‌లో కీల‌క బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తోంది. ఇటీవ‌లే తెలంగాణ స్ట్పోర్ట్స్ హ‌బ్‌కు కో ఛైర్మ‌న్‌గా ప్ర‌భుత్వం ఉపాస‌న కొణిదెల‌ను నియ‌మించింది.ఈ స్పోర్ట్స్ హ‌బ్ కోసం సంజ‌య్ గోయెంకా, క‌పిల్‌దేవ్‌, పుల్లెల గోపీచంద్ వంటి ప్ర‌ముఖుల‌తో ఉపాస‌న కొణిదెల ప‌నిచేస్తోంది. 2012లో టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చ‌రణ్‌తో ఉపాస‌న పెళ్లి జ‌రిగింది. 2023లో వీరికి కూతురు క్లింకార జ‌న్మించింది.

ఉపాస‌న‌కు సోష‌ల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అకౌంట్‌కు 12.5 మిలియ‌న్ల ఫాలోయర్స్ ఉన్నారు. సోష‌ల్ మీడియా ద్వారా సొసైటీలో మ‌హిళ‌ల‌పై కొన‌సాగుతోన్న వివ‌క్ష‌పై త‌ర‌చుగా గ‌ళం వినిపిస్తుంటుంది ఉపాస‌న కొణిదెల‌.

Also Read- Bigg Boss Sanjana Galrani: ఇదేం న్యాయం నాగార్జున గారు.. హరీష్ ని బలి చేసేశారుగా..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad