Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభUpasana Pregnancy : సరోగసి వార్తలకి చెక్ పెట్టిన ఉపాసన..

Upasana Pregnancy : సరోగసి వార్తలకి చెక్ పెట్టిన ఉపాసన..

- Advertisement -

Upasana Pregnancy : రామ్ చరణ్, ఉపాసన పెళ్లయిన పదేళ్ల తర్వాత తల్లితండ్రులు కాబోతున్నారని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా వెల్లడించాడు. దీంతో పదేళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ కి వారసుడు రాబోతున్నాడు అని అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

అయితే ఇన్నేళ్ల నుంచి ప్రెగ్నెంట్ అవ్వని ఉపాసన పదేళ్ల తర్వాత ఇప్పుడు పిల్లలు పుట్టబోతున్నారని చెప్పడంతో కొంతమంది సరోగసి ద్వారా ఉపాసన-చరణ్ పిల్లలు కంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకి ఇండైరెక్ట్ గా ఉపాసన చెక్ పెట్టింది.

ఇటీవల తన భర్త, స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్ళింది ఉపాసన. అక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కొన్ని ఫోటోలు దిగి షేర్ చేయగా వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ స్పష్టంగా చిన్నగా కనపడుతుండటంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఉపాసన ప్రెగ్నెంట్ అని, బేబీ బంప్ కనిపిస్తుందని, త్వరలోనే మెగా వారసుడు రానున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఫోటోలు పోస్ట్ చేసి సరోగసి వార్తలకి ఇండైరెక్ట్ గా చెక్ పెట్టేసింది ఉపాసన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad