Mega Function: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా, దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకల్లోనే ఉపాసనకు మినీ సీమంతం జరిగింది. ఈ వేడుకను ఉపాసన స్వయంగా ఒక వీడియో రూపంలో పంచుకుని “డబుల్ సర్ప్రైజ్” గురించి హింట్ ఇవ్వడంతో.. ఈసారి మెగా ఇంట్లో ఏకంగా కవలలు పుట్టబోతున్నారంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో “డబుల్ సర్ప్రైజ్, డబుల్ బ్లెస్సింగ్స్” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో, ఇండస్ట్రీలో కవల పిల్లల చర్చ మొదలైంది. చిరంజీవి గతంలో ఒక ఈవెంట్‌లో, తన ఇంట్లో మనవరాళ్లు ఎక్కువగా ఉన్నారని, ఈసారైనా ఒక మనవడు పుట్టాలని కోరుకుంటున్నట్లు సరదాగా చెప్పారు. ఇప్పుడు కవలలు వస్తున్నారనే ప్రచారంతో, కనీసం ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందేమో అని అభిమానులు ఆశపడుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-fauji-kannada-actress-chaitra-j-achar-cast-update/
అల్లు ఫ్యామిలీ మిస్సింగ్!
ఈ వేడుక వీడియోలో మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి, సురేఖ, సుస్మిత, శ్రీజ, వరుణ్ తేజ్-లావణ్య, అంజనాదేవి చాలా సందడిగా కనిపించారు. నాగార్జున, వెంకటేష్, నయనతార వంటి టాలీవుడ్ స్టార్స్ కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే, హాజరు కాని కొంతమంది గురించి ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేదు, కానీ ఆయన భార్య అన్నా లెజినోవా, కుమార్తెలు మాత్రం హాజరయ్యారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/samantha-begins-shooting-for-maa-inti-bangaram-movie/
చాలా ముఖ్యమైన ఈ కుటుంబ వేడుకలో అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎవరూ కనిపించలేదు. ఇదే విషయంపై సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు వచ్చాయి అంటూ ప్రచారంలో ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం, రాజకీయాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ గ్యాప్‌ను మరింత పెంచాయనే చర్చ ఉంది.
ముఖ్యమైన ఫంక్షన్‌లో అల్లు ఫ్యామిలీ లేకపోవడం చూస్తుంటే, ఈ రెండు అగ్ర కుటుంబాల మధ్య విభేదాల మంట ఇంకా చల్లారలేదనే విషయం స్పష్టమవుతోంది.


