Multistarrer Movies: మల్టీస్టారర్ మూవీ పట్ల ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఓ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమాలపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో లెజెండ్స్‌గా నిలిచిన టాప్ హీరోల కాంబినేషన్స్‌లో దక్షిణాదిలో కొన్ని మల్టీస్టారర్ మూవీస్ రాబోతున్నాయి. అనౌన్స్‌మెంట్స్ నుంచే అభిమానుల్లో ఈ మల్టీస్టారర్ సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. వేర్వేరు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాల కోసం ఇండియావైడ్‌గా ఉన్న సినీ లవర్స్ అతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలు ఏవంటే?
చిరంజీవి-వెంకటేష్ కాంబో సెట్…
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలిసి ఫస్ట్ టైమ్ ఓ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలని గతంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. కానీ ఫస్ట్ టైమ్ మనశంకరవరప్రసాద్‌గారుతో చిరంజీవి, వెంకటేష్ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటేష్ ఈ సినిమాలో నటించనున్న విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి అఫీషియల్‌గా ప్రకటించారు. అంతే కాకుండా అక్టోబర్‌లో మొదలుకానున్న షెడ్యూల్‌తో వెంకటేష్ మనశంకరవరప్రసాద్ గారు షూటింగ్‌లో భాగం కాబోతున్నట్లు వెల్లడించారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి స్క్రీన్‌పై కనిపించే సీన్లు అభిమానులకు విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయని మేకర్స్ చెబుతోన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్‌గారు మూవీ రిలీజ్ కాబోతుంది.
Also Read – Pooja Hegde: దుల్కర్ ప్రేమలో బుట్టబొమ్మ
46 ఏళ్ల తర్వాత…
కోలీవుడ్ అగ్ర హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్ కలయికలో ఓ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. లోకేష్ కనగరాజ్ ఈ మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నట్లుగా ఇటీవలే కమల్‌హాసన్ స్వయంగా ప్రకటించారు. దాదాపు 46 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలయికలో సినిమా రూపొందనుండటం కోలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది. కెరీర్ ఆరంభంలో పథినారు వయనిథిలే, అపూర్వ రాగంగల్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత విలక్కుమ్ రజనీకాంత్, కమల్‌హాసన్ కంబినేషన్‌లో వచ్చిన చివరి మూవీ. మళ్లీ లోకేష్ కనగరాజ్ మూవీతోనే ఈ ఇద్దరిని ఒకే సినిమాలో చూసే ఛాన్స్ అభిమానులకు కలగనుంది. త్వరలోనే ఈ మల్టీస్టారర్ మూవీ లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచే ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీగా హైప్ మొదలైంది.
మమ్ముట్టి-మోహన్‌లాల్…
మమ్ముట్టి, మోహన్‌లాల్.. వీరిద్దరు లేకుండా మలయాళ ఇండస్ట్రీ గురించి చెప్పడం కష్టమే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్‌ను పాన్ ఇండియన్ లెవెల్‌లో చాటిచెప్పారు. దాదాపు పదహారేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. మహేష్‌నారాయణన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మల్లీస్టారర్ తెరకెక్కుతోంది. ఇందులో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, కుంచకోబోబన్, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో ప్రెస్టీజియస్ మూవీగా ఈ మల్టీస్టారర్ రూపొందుతోంది. ఈ సూపర్ స్టార్స్ కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇప్పటివరకు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి 55 సినిమలు చేశారు. చివరగా 2008లో రిలీజైన ట్వంటీ సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్ హీరోలుగా నటించారు.
Also Read – TTD:పింక్ డైమండ్ వివాదానికి ముగింపు: శ్రీవారి హారంలో కేవలం కెంపు రాయి మాత్రమే


