Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభShahrukh Khan: షారూక్ ఖాన్‌ కి అసలు ఎలా అవార్డు ఇస్తారు??..సీనియర్‌ నటి మండిపాటు!

Shahrukh Khan: షారూక్ ఖాన్‌ కి అసలు ఎలా అవార్డు ఇస్తారు??..సీనియర్‌ నటి మండిపాటు!

National Film Awards Vs Shahruk Khan: దేశంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే 71వ జాతీయ సినీ పురస్కారాల జాబితా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవార్డుల ఎంపికపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినీ ప్రేక్షకులు, విమర్శకులు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటి ఊర్వశి కూడా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.

- Advertisement -

ఉత్తమ సహాయ నటి..

ఈ ఏడాది ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో ఊర్వశికి ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. అయితే, ఈ గౌరవాన్ని స్వీకరించినప్పటికీ, అవార్డు ఇచ్చిన తీరు, దాని వెనుక ఉన్న కారణాలపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ‘తనకు సహాయనటి అవార్డు ఎందుకు ఇచ్చారు?’ అనే ప్రశ్నను జ్యూరీ సభ్యులకు విసిరారు. సహాయనటిగా ఎవరి పాత్రలను పరిగణిస్తారో, దానికోసం ఏ ప్రమాణాలు పాటిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు.

సహాయ పాత్రలకు మాత్రమే పరిమితం..

ఊర్వశి మాట్లాడుతూ, వయస్సు పెరిగిన తర్వాత నటీమణులను సహాయ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తారా అని కూడా ప్రశ్నించారు. తన నటనను అంచనా వేయడానికి ఏ ప్రమాణాలు ఉపయోగించారో జ్యూరీ నుంచి సమాధానం రావాలని కోరారు. అవార్డు అందుకోవడం పెన్షన్ పొందడం కాదని, కేవలం మౌనంగా వచ్చి తీసుకుపోయేలా వ్యవహరించడం సరైంది కాదని స్పష్టం చేశారు.

ఆమె విమర్శలు ఇంతటితో ఆగలేదు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు ఈసారి ఉత్తమ నటుడి అవార్డు లభించడం కూడా ఆమె ప్రశ్నించారు. మలయాళ నటుడు విజయ రాఘవన్ ‘పూక్కలమ్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచారని, ఆయనకు ఉత్తమ నటుడు గౌరవం దక్కాలి అని ఊర్వశి అభిప్రాయపడ్డారు. కానీ ఆయనకు సహాయ నటుడి కేటగిరీలోనే అవార్డు ఇచ్చారని పేర్కొన్నారు.

విలువైన చిత్రాలకే ప్రాధాన్యం..

విజయ రాఘవన్ నటించిన చిత్రం బడ్జెట్ పరంగా పెద్దదిగా లేకపోవడం వల్లనే ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వలేదా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 250 కోట్ల రూపాయల విలువైన చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో, షారుక్ గతంలో చేసిన పలు శక్తివంతమైన పాత్రలకు అవార్డు రాకపోయినా, ఈసారి ‘జవాన్’ సినిమాలో నటనకుగాను అవార్డు లభించడం వెనుక కారణం ఏమిటో జ్యూరీ సభ్యులే చెప్పాలని అన్నారు.

Also Read: https://teluguprabha.net/lifestyle/raksha-bandhan-2025-auspicious-time-and-vastu-rules-full-details/

ఆమె వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చలు మరింత వేడెక్కాయి. కొందరు ఊర్వశి చెప్పిన విషయాలకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు జ్యూరీ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. సినీ పరిశ్రమలోని కొంతమంది కళాకారులు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ పురస్కారాల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత అవసరమని పలువురు భావిస్తున్నారు. ఒక కళాకారుడు చేసిన కృషిని గుర్తించడం కోసం అవార్డులు ప్రేరణగా ఉండాలి. కానీ వ్యక్తిగత అభిరుచులు, వాణిజ్య ప్రయోజనాలు, సినీ రంగంలోని రాజకీయాలు ప్రభావితం చేస్తే అవార్డుల విలువ తగ్గిపోతుందని విమర్శకులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad