Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ సర్‌ప్రైజ్..

Pawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ సర్‌ప్రైజ్..

Pawan Kalyan-Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమా తర్వాత సినిమాను కంప్లీట్ చేయడం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ప్రేక్షకులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. హరి హర వీరమల్లు లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత, పవన్ నుంచి ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటున్నారో, అలాంటి పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను ఓజి రూపంలో తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రతీ ఒక్కరిలో అంచనాలు భారీగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ లుక్స్, మేనరిజం, గ్యాంగ్‌స్టర్ గా కనిపించబోతున్న విధానం ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది.

- Advertisement -

ఇటీవల ఓజి సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. నెవర్ బిఫోర్ లైక్స్ ని దక్కించుకొని కొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఓజి ఫస్ట్ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. సెప్టెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ‘రన్ రాజా రన్’ లాంటి కామెడీ ఎంటర్‌టైనర్, సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేసిన సుజీత్ దర్శకత్వంలో ఓజి హాలీవుడ్ స్టైల్ లో రూపొందుతోంది. థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళుతుందని ఫస్ట్ సాంగ్ తో అర్థమైంది.

ఇక, పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో క్రేజీ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ స్కై రేంజ్ ఫ్యానిజంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ షెడ్యూల్ పూర్తైంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్, సాంగ్ మొత్తం పూర్తి కావడం. పవన్ ఉన్న బిజీ టైంలో ఇలా ఆయన చేయాల్సిన సీన్స్, సాంగ్ మొత్తం కంప్లీట్ అవడం కాస్త షాకింగ్ విషయమే.

Also Read – Mansoon :వర్షాకాలంలో ఫ్రిజ్‌ లో గిన్నెడు ఉప్పు …రిజల్ట్‌ మీరే చూడండి!

నిన్న మొన్నటి వరకు వీరమల్లు, ఓజి కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్, ఉస్తాద్ ని మాత్రం ఇప్పట్లో పూర్తి చేయకపోవచ్చునని మాట్లాడుకున్నారు. కానీ, అది తప్పని డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రూవ్ చేశారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న ఆన్ సెట్స్ పిక్ ని షేర్ చేసి, క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు. దీంతో, ఓజి, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల రాక కోసం అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈ రెండు సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్ కోసమే ప్రతీ ఒక్కరు ఎదురుచూడాలి. ఒక సినిమాకి థమన్ మ్యూజిక్.. మరో సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కాబట్టి.. గ్యారెంటీగా రెండు సినిమాలు మ్యూజికల్‌గా సూపర్ హిట్ అవడం ఖాయం. ఇక, పవర్ స్టార్.. ఈ సినిమాల తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్‌ని అనౌన్స్ చేస్తారా.. లేక సినిమాలకి గుడ్ బాయ్ చెప్తారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read – Kingdom: విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్‌కు కొత్త‌ క‌ష్టాలు.. మూవీని నిషేధించాలంటూ డిమాండ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad