Ustaad Bhagat Singh: అటు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మరోవైపు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పవన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ భారీ అంచనాల మధ్య వచ్చిన హరి హర వీరమల్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో ముగిసింది. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రాన్ని చేశారు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ఇటీవల ఓజీ సినిమా నుంచి వచ్చిన ఇమ్రాన్ హష్మీ గ్లింప్స్ భారీగా అంచనాలను పెంచాయి. ఈ నెల 25న ఓజీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ని ప్రారంభించబోతున్నారు. దీనిలో భాగంగా మేకర్స్ నిర్వహించబోయో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Also Read – Murder : ప్రేమ పేరిట పైశాచికం.. 51 స్క్రూడ్రైవర్ పోట్లతో ప్రియురాలి దారుణ హత్య!
ఇక పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. హరీష్ శంకర్ సినిమాలో కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిజం, హీరోయిన్స్ కి ప్రాధాన్యత, మ్యూజిక్.. ఇలా అన్నీ సాలీడ్ గా ఉంటాయి. ఉస్తాద్ లోనూ అవన్నీ పుష్కలంగా ఉన్నాయి.
అయితే, తాజా సమాచారం మేరకు ఉస్తాద్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 13వ తేదీ వరకూ ఉస్తాద్ లో పవన్ కళ్యాణ్ చేయాల్సిన పార్ట్ మొత్తం పూర్తవుతుందట. వరుసగా డేట్స్ ఇవ్వడంతో హరీష్ శంకర్ చక చకా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి, ఉస్తాద్ భగత్‌సింగ్ తర్వాత పవన్ కొత్త సినిమాలను ఒప్పుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. వాస్తవానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది.
Also Read – Navaratrulu: నవరాత్రుల్లో ఇంట్లో ఈ చోట దీపాలు పెట్టారంటే..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఇక!


