Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ నుంచి నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగున్నా. గ్రాఫిక్స్ వర్క్ తో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో దారుణంగా విమర్శలొస్తున్నాయి. సీజీ వర్క్ “లో” గ్రేడ్ సినిమాల కంటే చీప్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐదేళ్ల పాటు షూటింగ్…
సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలనే ఆలోచనతో సెకండాఫ్‌లోని చాలా సీన్స్‌ను బ్లూమ్యాట్స్ వేసి చుట్టేసినట్లు ఈజీగా కనిపించడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్ల పాటు షూటింగ్ చేసిన సినిమాలా లేదంటూ కామెంట్స్ పెడుతోన్నారు. ఒక్క పార్ట్‌కే ముగిసే పోయే కథను సాగదీసి… చివరకు అసంపూర్తిగా మధ్యలోనే ముగించి రెండు పార్ట్‌లు అంటూ ప్రకటించడంపై కూడా దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లులోని కొన్ని సీన్లు… ఛావా, బాహుబలితో పాటు గతంలో వచ్చిన హిస్టారికల్ మూవీస్‌లోని సన్నివేశాలను పోలి ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read – Low-cost farming : స్కూటర్‌తో సాగు.. ఖర్చుకు చెల్లు – కలుపుకు కళ్లెం!
రికార్డ్ ఓపెనింగ్స్…
పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ ప్రమోషన్స్‌తో హరిహర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరిగాయి. పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. లాంగ్ రన్ మాత్రం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓజీపై నో డౌట్స్…
హరిహర వీరమల్లుపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాల మేకింగ్‌పై అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఓజీపై పెద్దగా డౌట్స్ లేకపోయినా ఉస్తాద్ భగత్‌సింగ్ విషయంలో టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది.
జూన్‌లో షూటింగ్ మొదలు…
ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్‌లో మొదలైంది. పాలిటిక్స్‌పై దృష్టి పెడుతూనే మధ్య మధ్యలో ఈ సినిమాకు డేట్స్ కేటాయిస్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇంకో ఐదారు రోజులు మినహా ఉస్తాద్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఒక రకంగా పవన్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అయినా మరో రకంగా తక్కువ టైమ్‌లో సినిమా పూర్తి కావడంపై సందేహలు వ్యక్తమవుతోన్నాయి. హరిహర వీరమల్లు మాదిరిగానే ఈ సినిమాను చేట్టేశారు కావచ్చునని టెన్షన్ పడుతున్నారు. అయితే ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రాపర్ కమర్షియల్ మూవీ కావడం ఒక్కటే అభిమానులకు కాస్తంత ఊరటనిచ్చే విషయంగా కనిపిస్తోంది.
Also Read – Organic Farming : మునగాకు… 300 రోగాలకు విరుగుడు!
ఇద్దరు హీరోయిన్లు…
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


