Ustaad Bhagat Singh Look: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తారనే టాక్ వినిపించింది. కానీ.. రీసెంట్‌గా మారిన రిలీజ్ లెక్కలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
దాదాపు పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కు సరైన విజయం లేని సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఒక ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు తెరపై ఎలా చూడాలని కోరుకుంటారో.. అచ్చం అలాగే చూపించి హరీష్ శంకర్ ప్రేక్షకులకు ఫుల్ ఎనర్జీనిచ్చాడు. కేవలం అభిమానులే కాదు, ఒరిజినల్ సినిమా కంటే కూడా పది రెట్లు మెరుగ్గా ఉందని రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖ దర్శకులే గబ్బర్ సింగ్ కు ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతమైన కాంబినేషన్ మళ్ళీ కలిసినప్పుడు, అంచనాలు తారాస్థాయికి చేరడం సహజం. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.
Also Read – Lunar Eclipse: చంద్రగ్రహణంతో ఈ 6 రాశుల వారికి తప్పని తిప్పలు!
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సంద్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుంచి స్టైలిష్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డాన్స్ బీట్ లుక్‌లా అనిపిస్తోంది. చూస్తుంటే ‘ఈసారి కూడా ఫుల్ మీల్స్ ఖాయం’ అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా హరీష్ అదే నమ్మకంతో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ను తెరపై ఎలా అత్యంత శక్తివంతంగా, స్టైలిష్‌గా చూపించాలో హరీష్ శంకర్ కు బాగా తెలుసు అని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.‘ఇది కదా అసలైన పవన్ కళ్యాణ్ అంటే’ అని అభిమానులు పండగ చేసుకున్నారు.
తమిళ చిత్రం తెరికి ఇది రీమేక్ అనేది అందరికీ విదితమే. అయితే హరీష్ శంకర్ తనదైన మేకింగ్‌తో దీనికి ఒక కొత్త లుక్ తీసుకొస్తున్నాడు. శ్రీలీల ఇందులో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. రాశీ ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తుంది.


