Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎలాంటి ఇండస్ట్రీ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన టాప్ టెన్ సినిమాలో గబ్బర్‌సింగ్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి, క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీటవుతుండటంలో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్రేజీ హీరోయిన్స్..
పవన్ కళ్యాణ్ సరసన ఇందులో శ్రీలీల, రాశీఖన్నా నటిస్తున్నారు. వీరిద్దరికీ ఇప్పుడు హిట్ చాలా అవసరం. పవన్ సినిమాతో క్రేజీ హీరోయిన్స్‌గా మారిన వారు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీలకి హిట్ వచ్చి చాలాకాలం అయింది. రాశీఖన్నాది అదే పరిస్థితి. కాబట్టి, ఇప్పుడు వీరికి పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ సక్సెస్ చాలా కీలకం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read – Diwali 2025:ఈ ఏడాది కుబేరుడి చూపు…ఈ రాశుల మీదే..!
నవంబర్ టార్గెట్..
దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఈ ఏడాది నవంబర్ వరకూ పూర్తి చేయాలని గట్టిగా టార్గెట్ పెట్టుకున్నారట. ఇప్పటికే, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పార్ట్ మొత్తం పూర్తవగా, మిగిలిన టాకీపార్ట్ ని నవంబర వరకూ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని మొదలు పెట్టబోతున్నట్టు తాజా సమాచారం. దీనిని బట్టి చూస్తే సమ్మర్ కానుకగా ఉస్దాత్ భగత్‌సింగ్ వచ్చేస్తుందని సూచనలు అందుతున్నాయి.
ఓజీ మేనియాతో ఉస్తాద్‌పై భారీ అంచనాలు..
ఇటీవల పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ భారీ కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. దాంతో అదే బజ్ ఇప్పుడు ఉస్తాద్ మీద కూడా పడింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేస్తారా..? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి మైత్రీ మేకర్స్ అండ్ టీం ఎప్పుడు ఉస్తాద్ రాక గురించి అధికారికంగా వెల్లడిస్తారో చూడాలి. కాగా, పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ప్రకటనలను కూడా ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి, ఆ అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
Also Read – Dude: డ్యూడ్ రివ్యూ – ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు మూవీ హిట్టా? ఫట్టా?


