Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDisha Patani: కాల్పులు ఘటన.. ఎవరినీ వదలిపెట్టం.. దిశా పటానీకి ముఖ్యమంత్రి సపోర్ట్..

Disha Patani: కాల్పులు ఘటన.. ఎవరినీ వదలిపెట్టం.. దిశా పటానీకి ముఖ్యమంత్రి సపోర్ట్..

Disha Patani: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) టాలీవుడ్‌లో లోఫ‌ర్ సినిమాతో త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ మీద కూడా ఫోకస్ చేస్తోంది. తాజాగా ఆమె ఇంటి వ‌ద్ద జ‌రిగిన‌ సంచలన ఘటనతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. తెలుగులో ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాతో మెరిసిన ఈ నటి, తన గ్లామర్ ఫోటోలు, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చలో ఉంటారు. అయితే ఇటీవల దిశా ముంబైలోని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

- Advertisement -

ఈ ఘటన వెనుక దిశా సోదరి ఖుష్బూ (Kushboo) పటానీ చేసిన వ్యాఖ్యలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె కొన్ని మతసంబంధ విషయాలపై అభ్యంతరకరంగా మాట్లాడినందునే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన వారు, “ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది”.. అంటూ ఓ హెచ్చరిక మెసేజ్ కూడా విడుదల చేశారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Uttarapradesh CM Yogi Adiyanath) స్పందించటం కొస మెరుపు. ఆయ‌న‌ దిశా కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించడంతో పాటు, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దిశా తండ్రి జగదీష్ (Disha Patani Father Jagadeesh) పటానీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. కేసును చాలా సీరియస్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారని జ‌గ‌దీష్ పేర్కొన్నారు.

Also Read – Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మపై కేసు పెట్టిన ఐపీఎస్‌ అధికారిణి.. కారణమేంటో తెలిస్తే షాకవుతారు..!

ఇప్పటికే ఈ విష‌యంలో దోషులు ఎవ‌రో తెలుసుకునే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కాల్పుల వెనుక ఎటువంటి కుట్ర ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠిన శిక్ష విధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటానీ బాలీవుడ్‌లో (Bollywood Movies) పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చేసిన ‘కల్కి’ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. చివరగా ‘కంగువ’ (Kangua) అనే సినిమాలో కనిపించినా, సినిమా పెద్దగా నడవకపోయినా, ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం దిశా రెండు మూడు పెద్ద ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతోంది. మ‌రోసారి ఆమె కల్కి 2తో (Kalki 2) సందడి చేయ‌బోతుంది. వ‌చ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read – Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మపై కేసు పెట్టిన ఐపీఎస్‌ అధికారిణి.. కారణమేంటో తెలిస్తే షాకవుతారు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad