Vamshi: ‘వారసుడు’ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా, దర్శకుడు వంశీ పైడిపల్లి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన కొంతకాలంగా ఒక భారీ స్కిప్ట్ ని సిద్ధం చేసుకుని, దాన్ని పట్టాలెక్కించడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ముందుగా, ఈ కథను ఆమీర్ ఖాన్‌కు వినిపించాడు. ఆమీర్‌కు కూడా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఏమైందో తెలియదు, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమీర్ ఖాన్ తప్పుకున్నారు. ఆ తర్వాత, వంశీ అదే కథను సల్మాన్ ఖాన్ దగ్గరకు తీసుకెళ్లాడు. సల్మాన్‌తో కూడా చర్చలు జరిగాయి, కానీ అక్కడ కూడా సినిమా వర్కౌట్ అవ్వలేదు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/renukaswamy-hatya-case-darshan-maranashiksha-news/
ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ వద్దకు స్క్రిప్ట్!
ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరి దగ్గర నుంచి తిరిగి వచ్చిన ఈ కథ, ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు వంశీ కథ వినిపించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ కథ కూడా పాలిటిక్స్ చుట్టూ ఉంటుంది అని తెలుస్తుంది.
ఈ ప్రాజెక్టును కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇది నిజమైతే, వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబినేషన్ మరోసారి రిపీట్ అయినట్లే. వంశీ పైడిపల్లి కెరీర్‌లో మొత్తం ఆరు సినిమాలు తీస్తే, అందులో ఐదు సినిమాలకు దిల్ రాజునే నిర్మాతగా వ్యవహరించారు. ‘మున్నా’, ‘బృందావనం’, ‘ఎవడు’, ‘మహర్షి’, ‘వారసుడు’ లాంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/tollywood-december-2026-movies/
పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్‌తో, దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నారనే ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


