ప్రముఖ గాయకురాలు వాణీ జయరాం కన్నుమూశారు. చెన్నైలోన తన స్వగృహంలో 78 ఏళ్ల వాణి జయరాం కన్నుమూశారు. సినీ సంగీతం, కర్నాటక సంగీతంలో ప్రసిద్ధిగాంచిన వాణి బ్యాంకు ఉద్యోగినిగా కొంతకాలం హైదరాబాదులోనూ పనిచేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళంతో పాటు పలు భాషల్లో ప్రఖ్యాతిగాంచిన గాయనిగా, కర్నాటక సంగీత విద్వాంసురాలిగా ఆమె లబ్దప్రతిష్ఠులు. ఒకానొక సమయంలో నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన లతా మంగేష్కర్ ఈమెపై కక్షసాధింపు చర్యలకు దిగగా, బాలీవుడ్ లో వాణిజయరాంకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఈమధ్యనే పద్మ అవార్డుకు ఎంపికైనా వాణిజయరాం వివాదాలకు దూరంగా ఉంటారనే లో ప్రొఫైల్ సెలబ్రిటీగా పాపులర్ అయ్యారు.
Vani Jayaram: గాయని వాణిజయరాం కన్నుమూత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


