Varalakshmi Sarathkumar: ప్రముఖ నటుడు, నిర్మాత శరత్‌కుమార్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వరలక్ష్మీ శరత్‌కుమార్. విశాల్ సరసన హీరోయిన్‌గా కూడా నటించింది. కెరీర్ ప్రారంభంలో అందాల ఆరబోతతోనూ కోలీవుడ్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. గ్లామర్ రోల్స్ చేసిన వరలక్ష్మి.. ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొన్ని పేరు తీసుకొచ్చే పాత్రలను చేసి క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇలా, ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుండటంతో తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకున్నారు వరలక్ష్మి. మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన పక్కా మాస్ అండ్ కాప్ స్టోరీ క్రాక్ సినిమాతో తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. “రేయ్ కాకి” అంటూ పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్ లో నటించారు. ఈ సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, సమంత యశోద, తేజ సజ్జా హనుమాన్ లాంటి సినిమాలలో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.
Also Read – K-Ramp: ‘కె-ర్యాంప్’ టీజర్ కాంట్రవర్సీ.. బూతులపై కిరణ్ అబ్బవరం క్లారిటీ
సాధారణంగా హీరోయిన్ అంటే ఎక్కువగా సినిమాలలో నటించడానికే ఆసక్తి చూపిస్తుంటారు. హీరోయిన్ గా క్రేజ్ తగ్గాక.. తల్లి, అత్త, వదిన పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇక క్రేజ్ ఉంటే కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో నటించడానికి ఆరాట పడుతుంటారు. కానీ, కెప్టెన్ కుర్చీలో మాత్రం కూర్చోవడానికి సాహసం చేయరు. అందుకే, మన సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఈ లిస్ట్ లో ప్రముఖ నటిగా పాపులర్ అయిన వరలక్ష్మి శరత్‌కుమార్ చేరి సరస్వతి (saraswathi) అనే సినిమాతో దర్శకురాలిగా మారారు.
భారీ తారాగణంతో, టెక్నికల్ టీమ్ తో వరలక్ష్మి కొత్త ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. వరలక్ష్మి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ప్రియమణి (Priyamani), నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఇక భారీ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ అయిన ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండటం మరో గొప్ప విషయం. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న కొంతమంది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో అనుభవం లేకపోయినా కూడా చాలా సినిమాలు చేసిన అనుభవంతో కొన్ని విభాగాలపై పట్టు సాధించి ఓ అడుగు ముందుకేసి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. ఇప్పుడు వరలక్ష్మి కూడా ఇదే దారిలో ప్రయాణం మొదలు పెట్టారు. చూడాలి మరి ఎంతవరకూ ఈమె సక్సెస్ అవుతారో.
Also Read – Manchu Manoj: తారక్ చేతికి తగిలిన గాయానికి నేనే కారణం.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్


