Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభVarasudu: 20 రోజుల్లో 300 కోట్ల క్లబ్ లోకి వారసుడు

Varasudu: 20 రోజుల్లో 300 కోట్ల క్లబ్ లోకి వారసుడు

వారీసు, వారసుడు అంటూ సంక్రాంతికి సందడి చేసిన తమిళ్ సూపర్ స్టార్ విజయ్ బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేశారు. వారసుడు రిలీజ్ అయిన జస్ట్ 20 రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోవటం హైలైట్. దీంతో దళపతి విజయ్ కు సౌత్ లో ఎవరూ పోటీ రారని మరోసారి విజయ్ ప్రూవ్ చేసుకున్నట్టైంది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టిన విజయ్ మూవీ కర్నాటకలో మాత్రం బొక్కబోర్లా పడింది. హీరోయిన్ రష్మికపై కోపంతో కన్నడ వారసుడు సినిమాకు టికెట్లు అస్సలు తెగలేదు. ఒకవేళ శాండిల్ వుడ్ లో కూడా ఈ సినిమా హిట్ కొట్టి ఉంటే మరింత పెద్ద బ్లాక్ బస్టర్ గా ఇది రికార్డు సృష్టించేది. రొటీన్ స్టోరీగా తెరకెక్కినప్పటికీ, పెద్దగా పాజిటివ్ రివ్యూలు, రేటింగ్స్ రాకపోయినప్పటికీ పక్కా కమర్షియల్ సినిమా కావటంతో ఇది గ్రాండ్ హిట్ కొట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News