Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభVarun Dhawan : ప్రభాస్ నిజంగానే కృతి సనన్ తో రిలేషన్ లో ఉన్నాడా..?? బాలీవుడ్...

Varun Dhawan : ప్రభాస్ నిజంగానే కృతి సనన్ తో రిలేషన్ లో ఉన్నాడా..?? బాలీవుడ్ హీరో వ్యాఖ్యలకి అర్ధం ఏంటి..??

- Advertisement -

Prabhas-Krithi Sanon : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటాడు. అమ్మాయిలు చాలా మంది ప్రభాస్ ని చేసుకోడానికి రెడీగా ఉన్నా ప్రభాస్ మాత్రం సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ప్రభాస్ అనుష్కని పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ తో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

కొన్ని రోజుల నుంచి కృతి సనన్, ప్రభాస్ మధ్య ఏదో ఉందని బాలీవుడ్, టాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఆదిపురుష్ లో కలిసి నటించారు. ఇటీవల ఆదిపురుష్ టీజర్ ప్రమోషన్స్ లో కృతి సనన్ ప్రభాస్ ని చేయి పట్టించుకోని నడిపించడం, ప్రభాస్ కి చెమట వస్తే తన చీర కొంగుని ఇచ్చి తుడుచుకోమనడం, బాలీవుడ్ లో ఒక షోకి వెళ్తే ప్రభాస్ కి కాల్ చేయడం, ఓ ఇంటర్వ్యూలో ఛాన్స్ ఉంటే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం.. ఇలా అనేక సంఘటనలు చూసి ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారేమో అని అంతా అనుకుంటున్నారు.

తాజాగా కృతి సనన్, వరుణ్ ధావన్ కలిసి తోడేలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ఓ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కరణ్ జోహార్ కృతి సనన్ ని నీ హార్ట్ లో ఎవరు ఉన్నారు అని అడగడంతో వరుణ్ ధావన్.. కృతి సనన్ మనసులో ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ముంబైలో లేడు. ప్రస్తుతం దీపికా పదుకొనేతో సినిమా షూటింగ్ లో ఉన్నాడు అని అన్నాడు. దీంతో కృతి సిగ్గుపడిపోయింది. ప్రస్తుతం దీపికా ప్రాజెక్ట్ K షూటింగ్ లో ఉంది. ఇందులో హీరో ప్రభాస్. ఇలా వరుణ్ ధావన్ ఇండైరెక్ట్ గా ప్రభాస్-కృతి సనన్ గురించి చెప్పడంతో మరోసారి నెటిజన్లు ప్రభాస్-కృతి సనన్ నిజంగానే రిలేషన్ లో ఉన్నారేమో అని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News