Tuesday, May 6, 2025
Homeచిత్ర ప్రభVarun Tej: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్-లావణ్య జంట

Varun Tej: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్-లావణ్య జంట

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల ప్రేమ అనంతరం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు. కొన్ని రోజులుగా లావణ్య గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ వరుణ్-లావణ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పిల్లల షూస్‌తో పాటు వరుణ్, లావణ్య కలిసి చేతులు పట్టుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ జీవితం మరింత అందంగా మారబోతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు.

- Advertisement -

దీంతో సెలబ్రెటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా కుటుంబంలోకి మరో వారసుడు/వారసురాలు రానున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వరుణ్ సినిమాల విషయానికొస్తే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల అతను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News