Varun – Lavanya: మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కొడుకు పేరును దసరా రోజు రివీల్ చేశారు. సెప్టెంబర్ 10న లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా తనయుడి పేరును సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆంజనేయ స్వామి దయతో జన్మించిన మా బాబుకు వాయువ్ తేజ్ కొణిదెల అనే పేరు పెట్టాం అని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెల్లడించారు. కుమారుడితో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తనయుడిని చూసి వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి మురిసిపోతూ కనిపించారు. చిన్నారి ముఖం మాత్రం చూపించలేదు. వరుణ్, లావణ్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2023లో పెళ్లి…
2023 నవంబర్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరిగింది. పెళ్లికి ముందు మూడేళ్ల పాటు ఈ జంట ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేశారు. ఈ షూటింగ్ టైమ్‌లోనే ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
Also Read – Sree Vishnu: రూటు మార్చిన శ్రీవిష్ణు – నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త సినిమా – టైటిల్ రివీల్
కొరియన్ కనకరాజు…
ప్రస్తుతం వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు పేరుతో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ముందు వరుణ్ తేజ్ చేసిన మట్కాతో పాటు ఆపరేషన్ వాలెంటైన్, గాంఢీవధారి అర్జున సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం కొరియన్ కనకరాజుపైనే వరుణ్ తేజ్ ఆశలు పెట్టుకున్నాడు.
సతీ లీలావతి…
మరోవైపు పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది లావణ్య త్రిపాఠి. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన సతీ లీలావతి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. సతీ లీలావతి సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు.
Also Read – Raju Gari Gadhi 4: రాజుగారి గది 4 వచ్చేస్తోంది – ఈ సారి డివోషనల్ టచ్‌తో – రిలీజ్ డేట్ కన్ఫామ్


