Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభVenkatesh movie to release on Sankranthi: శరవేగంగా సాగుతున్న వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ

Venkatesh movie to release on Sankranthi: శరవేగంగా సాగుతున్న వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ

సంక్రాంతికి వెంకటేష్ సినిమా రెడీ

పొల్లాచ్చిలోని అందమైన ప్రదేశాలలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌లపై లవ్లీ హస్బెండ్, వైఫ్ సాంగ్ చిత్రీకరణ

- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది.

ప్రస్తుతం, పొల్లాచ్చిలోని కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లు పోషించిన భార్య, భర్తలపై ఒక అందమైన పాట చిత్రీకరించారు. సంగీతంలో తో ఫారమ్‌లో ఉన్న భీమ్స్ సిసిరోలియో చార్ట్‌బస్టర్ పాటను సంగీతం అందించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని సమకూర్చారు. డ్యాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటి కానుంది.

ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరో నాయికగా నటిస్తోంది. ఈ త్రికోణ క్రైమ్ డ్రామాలో అతని మాజీ ప్రేయసిగా ఆమె కనిపించనుంది.

ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఎడిటింగ్ తమ్మిరాజు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేకు సహకరించారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad