MSVG: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా గురించి టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక హాట్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు అధికారికంగా తెలుస్తోంది, అంతేకాదు, ఆయన తాజాగా షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు.
నేటి నుంచే వెంకటేష్ సందడి!
‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లోనే విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొనడం విశేషం. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించే కీలక సన్నివేశాలను, ఒక స్పెషల్ సాంగ్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. మెగాస్టార్, వెంకీమామ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/naga-vamsi-comments-on-loka-movie/
క్లైమాక్స్ మొత్తం వెంకీమామదే!
వెంకటేష్ పాత్ర కేవలం అతిథి పాత్ర (Cameo) లా కాకుండా, కథలో చాలా కీలకమైనదిగా ఉంటుందని తెలుస్తోంది. లీకైన సమాచారం ప్రకారం, సినిమా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సుమారు 30 నిమిషాల పాటు ఆయన స్క్రీన్‌పై కనిపించబోతున్నారట. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి అంత ఎక్కువ సమయం స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలని మెగా, వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి 2026కి ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌తో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా బాగా సందడి చేస్తుంది అనిపిస్తుంది.


