Venkatesh: ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతికి వస్తున్నాంలో తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో అభిమానులను మెప్పించారు వెంకీ. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఐదారు నెలలు షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన వెంకటేష్ అక్టోబర్ నుంచి తిరిగి కెమెరా ముందుకు రాబోతున్నారు.
రెండు సినిమాలు…
ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు వెంకటేష్. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకరవరప్రసాద్‌గారులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు అక్టోబర్‌లో మొదలుకాబోతున్నాయి.
Also Read- Prakash Raj tweet: మోదీపై ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్.. నీకు అంత సీన్ లేదంటున్న నెటిజన్లు!
అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి….
వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్ 6 నుంచి మొదలుపెట్టేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారట. పది రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ సాగనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ మూవీలో మరో హీరోయిన్‌కు స్థానం ఉన్నట్లు సమాచారం. షూటింగ్ మొదలయ్యేలోపు ఆ హీరోయిన్‌ను ఫైనల్ చేయనున్నారు మేకర్స్…
ఫన్ ఫ్యామిలీ మూవీ…
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లో ఉన్న అంచనాలకు తగ్గట్లే ఫన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ హీరోగా నటిస్తున్న 77వ సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
చిరంజీవి సినిమాలో…
మరోవైపు చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్‌గారులో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో వెంకటేష్ భాగం కాబోతున్నారు. అక్టోబర్ 20 నుంచి మొదలయ్యే నెక్స్ట్ షెడ్యూల్‌లో చిరంజీవి, వెంకటేష్‌లకు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందులో చిరంజీవి, వెంకటేష్‌లపై ఓ మాస్ సాంగ్ కూడ ఉండనుందట. ఈ పాటను నవంబర్‌లో స్పెషల్ సెట్ వేసి షూట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read- Akhanda 2: 600 మంది డానర్స్‌తో అఖండ 2 సాంగ్.. ఫ్యాన్స్ ఊగిపోవటం పక్కా!
సంక్రాంతికి రిలీజ్…
మన శంకరవరప్రసాద్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి సాహు గారపాటి మన శంకరవరప్రసాద్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.


