Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభVenkatesh Trivikram: సైలెంట్‌గా వెంకీ, త్రివిక్ర‌మ్ మూవీ లాంఛ్ - రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడంటే?

Venkatesh Trivikram: సైలెంట్‌గా వెంకీ, త్రివిక్ర‌మ్ మూవీ లాంఛ్ – రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడంటే?

Venkatesh Trivikram: కొన్ని కాంబినేష‌న్స్ ప‌ట్ల ఆడియెన్స్‌లో స్పెష‌ల్ క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లో హీరో వెంక‌టేష్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అలాంటిదే. వెంక‌టేష్ హీరోగా న‌టించిన నువ్వునాకున‌చ్చావ్‌, వాసు, మ‌ల్లీశ్వ‌రి సినిమాల‌కు స్టోరీ, డైలాగ్ రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు త్రివిక్ర‌మ్‌. ఈ మూడు సినిమాలు పెద్ద విజ‌యాల్ని సాధించాయి. ఈ సినిమాల్లో త‌న కామెడీ టైమింగ్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు వెంక‌టేష్‌ ఫ‌స్ట్ టైమ్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆగ‌స్ట్ 15న శుక్ర‌వారం ఈ మూవీ అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

- Advertisement -

77వ మూవీ…
వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను సింపుల్‌గా నిర్వ‌హించారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న 77వ మూవీ ఇది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌లో నిర్మాత సురేష్‌బాబు పాల్గొన్నారు. వెంక‌టేష్‌పై చిత్రీక‌రించిన మొద‌టి స‌న్నివేశానికి సురేష్‌బాబు క్లాప్ నిచ్చారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Also Read – Pooja Hegde: పూజా హెగ్డే బ్యాడ్‌టైమ్ కంటిన్యూ – కూలీతో మార‌ని బుట్ట‌బొమ్మ ల‌క్‌

ఫ‌న్ ఫ్యామిలీ డ్రామా…
త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల శైలిలోనే ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉండ‌బోతుంద‌ట‌. ఈ సినిమాకు వెంక‌ట‌ర‌మ‌ణ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

త్రిష హీరోయిన్‌…
త్రివిక్ర‌మ్ మూవీలో వెంక‌టేష్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వెంక‌టేష్, త్రిష క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతోన్న నాలుగో మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, న‌మో వెంక‌టేశ‌, బాడీగార్డ్ సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. వెంకీ, త్రిమిక్ర‌మ్‌ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్న‌ట్లు తెలిసింది.

Also Read – Chiranjeevi Birthday: చిరంజీవి బ‌ర్త్‌డే ట్రీట్ – ఈ సారి మెగాస్టార్‌ ట్రిపుల్ బొనాంజా

సంక్రాంతి విన్న‌ర్‌…
కాగా ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నారు వెంక‌టేష్‌. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న మూవీలో వెంక‌టేష్ ఓ స్పెష‌ల్ రోల్ చేస్తున్నాడు. మెగా 157 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. వెంక‌టేష్ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్‌తో ఓ మైథ‌లాజిక‌ల్ సినిమా చేయ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad