వివాదాస్పద జ్యోతిషుడు వేణు స్వామి(Venu Swamy) మరోసారి వార్తల్లో నిలిచాడు. సెలబ్రెటీల గురించి జ్యోతిష్యకం చెబుతూ పాపులర్ అయిన వేణుస్వామి ఇటీవల ఎక్కువ కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటున్నాడు. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ కూడా నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఏకంగా మహిళా కమిషన్ సీరియస్ కావడంతో క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ తన పద్ధతి మార్చుకోని వేణుస్వామికి సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో రెబల్ స్టార్ ప్రభాస్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత సూసైడ్ చేసుకుంటారని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఆ ఆడియో కాల్‌లో వేణుస్వామి ఇలా మాట్లాడాడు. ‘నేను ముగ్గురు చనిపోతారని చెప్పా. ఒకరు సూసైడ్ చేసుకుంటారు. ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతారు. నేను చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత.. వీరిలో ఎవరన్నా ఒకరు సూసైడ్ చేసుకుంటారు? నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. బయటికి రావడానికి టైం పడుతుంది. మీడియాకి ఎవ్వరికీ చెప్పలేదు. మేనేజ్ చేస్తున్నారు. సినిమా పోస్ట్‌పోనే అయ్యింది కదా.. రాజా సాబ్ సెప్టెంబర్‌కి పోయింది.. ప్రభాస్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. ఒక్కటి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకూ అన్నీ ప్రాబ్లమ్సే.. ’ అంటూ వేణుస్వామి వ్యాఖ్యానించాడు. ఈ ఆడియో కాల్‌పై ఫ్యాన్స్, ఫిల్మ్ జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.