Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభVeteran actor Vikram Gokhale : ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

Veteran actor Vikram Gokhale : ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

Veteran actor Vikram Gokhale : ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు విక్రమ్ గోఖలే క‌న్నుమూశారు. గత కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య ప‌రిస్థితి పూర్తిగా క్షీణించ‌డంతో శ‌నివారం తుది శ్వాస విడిచాడు. ఆయ‌న వ‌య‌స్సు 77 సంవ‌త్స‌రాలు. ఈ రోజు సాయంత్రం పూణేలోని వైకుంఠ శ్మ‌శాన వాటిక‌లో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

- Advertisement -

ప్రముఖ మరాఠీ థియేటర్, సినీ నటుడైన‌ చంద్రకాంత్ గోఖలే కుమారుడే విక్ర‌మ్ గోఖ‌లే. బాలీవుడ్‌, మ‌రాఠీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ ‘హమ్ దిల్‌దే చుకే సనమ్’ (1999), కమల హాసన్ సినిమా ‘హే రామ్’, ‘భూల్ భులైయా’ (2007), ‘దే దనాదన్ (2009), ‘మిష‌న్ మంగ‌ళ్‌’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆయ‌న‌ నటించారు. 2010లో ఆయ‌న ఉత్త‌మ‌ న‌టుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. మరాఠీ చిత్రం ‘ఆఘాత్’ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బుల్లితెర‌పైనా త‌న‌దైన ముద్ర‌ను వేశాడు. ‘ఘర్ ఆజా పరదేశి’, ‘అల్ప్విరామ్’, ‘జానా నా దిల్ సే దూర్’, ‘సంజీవ్ని’, ‘ఇంద్రధనుష్’ వంటి షోల‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad