Actress Nalini Bhikshatanam: సినీ ఇండస్ట్రీలో హిట్, నేమ్, ఫేమ్ ఉంటే పరిస్థితి ఒకలా ఉంటుంది.. లేకుంటే ఎవరూ పట్టించుకోరు. ఇవాళ్టి స్టార్లే రేపటికి జీరోలుగా మారిపోయిన సందర్భాలు కోకొల్లలు. అలాగే కొందరికైతే ఒక్క హిట్‌తో జీవితమే మారిపోతుంది. ఇదే కారణంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎంతో మంది కళాకారులు వారి పీక్స్‌లో కోట్లు సంపాదించి లగ్జరీ లైఫ్ గడిపారు కానీ, చివరికి పూట గడవడం కూడా కష్టమై పోయిన ఉదాహరణలు ఉన్నాయి. అందులో కొంతమంది భిక్షాటన కూడా చేయాల్సి వచ్చింది.
నటి నళిని భిక్షాటన ..!
తాజాగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటి నళిని చెన్నైలోని ఓ దేవాలయం ముందు భిక్షాటన చేస్తూ కనిపించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె భిక్షాటనకు కారణం ఆర్థిక సమస్యలు కాదని, అది ఆమె భక్తిని చూపించే మార్గమని తెలిసింది. చెన్నైలోని తిరువేర్కడు ప్రాంతంలోని కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట నళిని భిక్షాటన చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘అమ్మవారు కలలో కనిపించి.. నా కోసం నువ్వేం చేయగలవని అడిగింది. నేను చేయగలిగింది ఇదే అనిపించి అమ్మవారి మందిరం ముందు భిక్షాటన చేస్తున్నాను’ అని అన్నారు.
Also Read- Andhra King Taluka Song: ఒక్క సాంగ్‌తో ఎక్కడికో క్రేజ్ వెళ్లింది!
భిక్షాటన ద్వారా వచ్చిన కానుకలను..
తన భక్తికి గుర్తుగా, భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును కూడా అమ్మవారికే సమర్పించినట్లు నళిని ఈ సందర్బంగా చెప్పింది. ఇది చూసిన చాలామంది షాక్ అవ్వడంతో పాటు, నళిని మానసికంగా బలంగా ఉన్న తత్వవాది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చిన్ననాటి నుంచే పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉండేది నళిని ఆధ్యాత్మికత పట్ల ఎంత ఆసక్తి కలిగివున్నదో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు, జీవనశైలి ద్వారా ఇప్పటికే తెలిసింది.
స్టార్ హీరోల సరసన నటించిన నళిని
నళిని తన సినీ కెరీర్‌ను 1981లో విడుదలైన ‘రాణువ వీరన్’ అనే సినిమాతో ప్రారంభించింది. ఆ సినిమాలో చిరంజీవి, రజినీకాంత్ లాంటి లెజెండ్స్‌తో కలిసి నటించింది. ఆ తరువాత కూడా ఆమె స్టార్ హీరోయిన్‌గా అనేక హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే చిన్న వయసులో స్టార్ డమ్ రావడంతో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కాక చాలావరకు అవకాశాలు కోల్పోయానని ఓ సందర్భంలో ఆమె చెప్పింది. ముఖ్యంగా అవుట్‌డోర్ షూట్స్ అంటే భయపడటంతో తాను చాలా పెద్ద చిత్రాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
ఇప్పటికీ టీవీ రంగంలో ..
నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించిన నళిని ప్రస్తుతం తమిళ టెలివిజన్ రంగంలో సీరియల్స్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. ఆమె భిక్షాటన చేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినా, ఆ సంగతి ఆధ్యాత్మిక నమ్మకంతో చేసినదిగా తెలిసి చాలామందిని ఆకట్టుకుంది. నళినిలాంటి నటీమణులు తమ జీవితాన్ని ఒక వైవిధ్యమైన దృక్పథంతో నడిపిస్తే, ప్రేక్షకుల్లో కొత్త ఆలోచనలు తలెత్తడం ఖాయం.


