Marathi actress Jyoti Chandekar Passes Away: మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మరాఠీ నటి జ్యోతీ చందేకర్ (69) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. 12ఏళ్ల వయసులోనే యాక్టింగ్ ప్రారంభించిన ఆమె.. పలు సీరియళ్లు, చిత్రాల్లో నటించారు. ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ సీరియళ్లు జ్యోతి చందేకర్ కెరీర్‌ను మలుపు తిప్పాయి. అలా బుల్లితెరపై వచ్చిన ఫేమ్‌తో ఆమెకు వరుస సినిమా ఛాన్స్ లు క్యూ కట్టాయి.
‘థోల్కీ’, ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలతో చందేకర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం చందేకర్ కూతురు తేజస్వినీ పండిట్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘తిచా ఉంబర్తా’లో నటించడం విశేషం. మారాఠి ఇండస్ట్రీ నుంచి ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/highest-day-1-gross-movies-in-indian-movies/
కాగా, జ్యోతి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ రోజు ఉదయం పుణెలోని తమ నివాసం జ్యోతి చందేకర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఆమె కూతురు, నటి తేజస్విని పండిట్ తెలిపారు. ఇకపోతే తరాలా తార్ మాగ్‌ను ప్రసారం చేస్తున్న స్టార్ ప్రవాహ్ ఛానెల్, తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మరాఠీలో ఒక పోస్ట్‌తో నటికి నివాళులర్పించింది: “అందరి ప్రియమైన పూర్ణ అమ్మమ్మ (సీనియర్ నటి) జ్యోతి చందేకర్‌కు హృదయపూర్వక నివాళి.” అని పేర్కొంది


