Vetrimaran: ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా, భారీ చిత్రాలు తీసిన నిర్మాత అయినా చిత్ర పరిశ్రమలో కొన్ని సందర్భాలలో తప్పక కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి నిర్ణయాల వల్ల కఠినమైనప్పటికీ జీవితం ఎంతో బాగుపడుతుంది.. అనుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇప్పుడు ఓ తమిళ స్టార్ డైరెక్టర్ తీసుకున్న ఇటువంటి నిర్ణయానికి అభిమానులు ఎంతో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వెట్రిమారన్. ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఎందుకు ఆయన ఇదే నా చివరి సినిమా అని ప్రకటించారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2007లో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘పొల్లాధవన్’ అనే చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చారు వెట్రిమారన్. మొదటి సినిమా మంచి విజయం అందుకుంది. దాంతో ఆయనకి దర్శకుడిగా మంచి సక్సెస్ దక్కింది. ఈ సినిమా తర్వాత ఆడుకాలం, వడ చెన్నై, విదుతి భాగం, అసురన్, విదుతి భాగం ఒండ్రు, విదుతి భాగం ఈతు వంటి సినిమాలను చేశారు. ఇవన్నీ కూడా ఆయనకి దర్శకుడిగా ఉన్నత స్థానానికి తీసుకువచ్చినవే. ఇక ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకుడిగా హీరో శింబు ఒక సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా సక్సెస్ అయిన వెట్రిమారన్, నిర్మాతగా కూడా మారడం విశేషం.
Also read – KLM:హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కి కేఎల్‌ఎం కొత్త విమానాలు!
వెట్రిమారన్.. 2012లో “క్రాస్ రూట్స్ ఫిలిం కంపెనీ” అనే నిర్మాణ సంస్థను స్థాపించి, దీని ద్వారా కాకాముట్టై, ఇనారి కోడి, అన్నంకు జై, వడ చెన్నై తో పాటూ మరికొన్ని సినిమాలను స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా ‘బ్యాడ్ గర్ల్’ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా విడుదలకి సెన్సార్ బోర్డుతో బాగా పోరాడాల్సి వచ్చింది. ఎలాంటి ఫలితం లేకపోవడంతో తన సొంత నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాతగా సినిమాలు చేసిన జర్నీ గురించి ఎవరూ ఊహించని రీతిలో మాట్లాడారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన.. “సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగడం చాలా ఈజీ. కానీ, నిర్మాతగా సక్సెస్ కావడం మాత్రం అందరూ అనుకునేంత ఈజీ, సులభం కాదు. దర్శకుడిగా అయితే మన పని మనం చేసుకోవచ్చు. నిర్మాతగా మాత్రం ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా నటీనటుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సినిమాకి కొబ్బరి కాయ కొట్టిన రోజు నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చేవరకు ప్రతీది భరించాలి. ఆర్ధికంగా నష్టమైనా.. లాభమైనా.. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. పైగా నా సినిమాలు కోర్టు వరకూ వెళుతున్నాయి. ఇవన్నీ నాకు అవమానంగా అనిపించింది. అందుకే.. నిర్మాణ సంస్థను మూసివేస్తున్నాను అని వెట్రిమారన్ అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read – Challans on CM Canvoy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలపై 18 చలాన్లు!


