Vidyabalan: ప్రస్తుతం బాలీవుడ్‌పై సౌత్ సినిమాల డామినేషన్ కొనసాగుతోంది. సౌత్ సూపర్ స్టార్స్ నటించిన సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలు పాన్ ఇండియన్ వైడ్‌గా ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. ఈ భాషల్లో నటించడానికి బాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం ఆసక్తిని చూపుతున్నారు. బాబీడియోల్, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టితో పాటు పలువురు బాలీవుడ్ యాక్టర్స్ రీసెంట్‌గా దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా వీరి బాటలోనే మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అడుగులు వేయబోతుంది. రజనీకాంత్ మూవీతో విద్యాబాలన్ కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో రూపొందిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తమిళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీకి జైలర్ 2 పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్‌లో విద్యాబాలన్ హీరోయిన్‌గా నటిస్తుందట. రజనీకాంత్‌తో జోడీగా జైలర్ 2లో విద్యాబాలన్ కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ లో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి మెయిన్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. అతడి కూతురిగా విద్యాబాలన్ పాత్ర సాగుతుందట.
Also Read – Ravi Teja: ‘బాహుబలి’ ఎఫెక్ట్ రవితేజ ‘మాస్ జాతర’ మళ్లీ వాయిదా!
జైలర్ 2 తమిళంలో విద్యాబాలన్ ఫస్ట్ మూవీ. గతంలో అజిత్ హీరోగా నటించిన నెర్కొండపరావై మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. జైలర్ 2లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తుంది. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో జైలర్ 2 షూటింగ్‌లో విద్యాబాలన్ జాయిన్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తిలపై డైరెక్టర్ నెల్సన్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
జైలర్ 2 షూటింగ్ యాభై శాతానికిపైగా పూర్తయ్యింది. నెక్స్ట్ గోవాలో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌లోగా షూటింగ్‌ను పూర్తిచేసి జనవరి నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. జైలర్ 2 మూవీ జూన్ 12న తెలుగు, తమిళం, హిందీతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. జైలర్ 2 తర్వాత కమల్‌హాసన్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు రజనీకాంత్.
Also Read – Mamitha Baiju: ఒక్కో సినిమాకు పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ – డ్యూడ్ హీరోయిన్ రియాక్షన్ ఇదే


