Vijay Devarakonda Car Accident: సినీ నటుడు విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కాగా, ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ తన మేనేజర్ రవికాంత్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి పుట్టపుర్తి వెళ్లారు. సాయిబాబా దర్శనం అనంతరం కారులో హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం 44 వ జాతీయ రహదారి పక్కన వరసిద్ధి వినాయక పత్తి మిల్లు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తరలిస్తున్న బస్సు.. సడెన్ బ్రేక్ వేయడంతో బొలెరో వాహనాన్ని విజయ్ కారు ఢీకొట్టింది.

దీంతో విజయ్ కారు పాక్షికంగా దెబ్బతినగా.. కారులోని ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం విజయ్ వేరు కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే నిశ్చితార్థం తర్వాత విజయ్ పుట్టపర్తికి ఆదివారం ఉదయం కారులో బయలుదేరుతుండగా ఉండవల్లి శివారులో అతివేగంతో వెళ్తుండటంతో పోలీసులు ఫైన్ వేశారు. ఈ రోజు సాయంత్రం అదే ప్రాంతంలో విజయ్ కారుకు యాక్సిడెంట్ అయింది.


