Vijay Devarakonda: టాలీవుడ్‌లో మరో కొత్త కాంబో సెట్టయ్యింది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. రౌడీ జనార్ధన పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఓపెనింగ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండతో పాటు కీర్తి సురేష్ అటెండ్ అయ్యారు. రౌడీ జనార్ధన లాంఛింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 14వ మూవీ ఇది. దిల్‌రాజు బ్యానర్‌లో 59వ సినిమా కావడం గమనార్హం.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో..
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రౌడీ జనార్ధన తెరకెక్కబోతున్నది. ఈ నెల 16 నుంచి ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
రౌడీ జనార్ధన మూవీలో మాసీ క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు.
Also Read – Kiran Abbavaram: కే ర్యాంప్‌లో 16 లిప్‌లాక్స్ – ముద్దు సీన్లలో కిరణ్ అబ్బవరం మూవీ రికార్డ్
జోడీగా ఫస్ట్ టైమ్…
కీర్తి సురేష్ మహానటిలో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్ర పోషించాడు. కానీ జోడీగా మాత్రం నటించలేదు. రౌడీ జనార్ధనతో ఫస్ట్ టైమ్ రొమాంటిక్ పెయిర్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సాంకృత్యాన్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
పెళ్లి తర్వాత…
రౌడీ జనార్ధనతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది కీర్తి సురేష్. చివరగా నాని దసరా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కీర్తి సురేష్. తమిళ సినిమాలతో బిజీగా ఉండటంతో టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తొలి తెలుగు మూవీ ఇదే కావడం గమనార్హం.
Also Read – Priyanka Mohan: AI ఒక శాపం, తాజా బాధితురాలు ‘OG’ హీరోయిన్!


