Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKingdom Twitter Review: ‘కింగ్డమ్’ హిట్టా..ఫ‌ట్టా?.. నెటిజ‌న్స్ రియాక్ష‌న్ ఎలా ఉందంటే!

Kingdom Twitter Review: ‘కింగ్డమ్’ హిట్టా..ఫ‌ట్టా?.. నెటిజ‌న్స్ రియాక్ష‌న్ ఎలా ఉందంటే!

Kingdom Twitter Review: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో రూపొందిన యాక్ష‌న్ మూవీ ‘కింగ్డమ్’. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్‌, శ్రీక‌ర స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సినిమాను నిర్మించారు. రౌడీ స్టార్ హిట్ కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో ‘కింగ్డమ్’ మూవీ స‌క్సెస్ త‌న‌కెంతో కీల‌కంగా మారింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందనే దానిపై నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ వారు చెబుతున్నదేంటో చూద్దాం…

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త చిత్రాల్లో లైగ‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత త‌న క్రేజ్ త‌గ్గుతుంద‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఖుషి మూవీ పరావాలేద‌నిపించుకుంది. అయితే ఫ్యామిలీ స్టార్ డిజాస్ట‌ర్ కావ‌టం కాస్త రౌడీ స్టార్‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. దీంతో త‌ను కాస్త బ్రేక్ తీసుకుని, గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చేసిన సినిమాయే ‘కింగ్డమ్’. దీనిపై ఫ్యాన్స్‌, నెటిజన్స్‌, కామ‌న్ ఆడియెన్స్ రియాక్ష‌న్స్…

‘కింగ్డమ్’ ఫస్టాఫ్ చాలా బావుంది. ముఖ్యంగా అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. విజయ్ దేవరకొండ నటన ఫైర్‌లా ఉంది.. ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది. ఇక సెకండాఫ్ బావుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తను సినిమాకు మూడున్నర రేటింగ్ ఇచ్చాడు మరి.

‘కింగ్డమ్’ యాక్షన్ డ్రామా అయినప్పటికీ ఎమోషనల్‌గానూ బాగా కనెక్టింగ్ అవుతుంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నెరేషన్ బావుంది. ఫ్లాట్ నెరేషన్‌గా అనిపించినప్పటికీ ఎక్కడా పక్కదారి పట్టలేదు. విజయ్ దేవరకొండ సహా నటీనటుల పెర్ఫామెన్స్‌తో పాటు టెక్నికల్‌గానూ మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని మరొకరు ట్వీట్ చేశారు.

విజయ్ దేవరకొండ, అనిరుద్ కాంబో షో అని అంటూ విజయ్ డేడికేషన్, స్క్రీన్ ప్రెజన్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

గత టాలీవుడ్ చిత్రాల్లో బెస్ట్ ఫస్ట్ హాఫ్ కింగ్డమ్ మూవీకి ఉందని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అదిరిందని, విజయ్ దేవకొండ హార్డ్ వర్క్, పెర్ఫామెన్స్‌తో పాటు.. అనిరుద్ పీక్స్ అంటూ ఓ నెటిజన్స్ ట్వీట్ చేశాడు.

విజయ్ దేవరకొండ యాక్టింగ్ టెరిఫిక్, సూరి పాత్రలో తన ఫైర్‌లా నటించాడు. అనిరుద్ మరో హీరో అనే చెప్పాలి. తన సంగీతం నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్బ్. సినిమా చూడాల్సిందేనని ఓనెటిజన్ తన ఓపినియన్ షేర్ చేశాడు.

ఇప్పటికే యు.ఎస్. ప్రీమియర్స్ నుంచి వస్తోన్న కొంత మేరకు రెస్పాన్స్ ఇదైతే మరిక్కడ ఆడియెన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad