Vijay Deverakonda: న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌ను నిర్వహించారు. ఈ పరేడ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్‌గా వ్యవహరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియన్ పరేడ్‌లలో ఒకటిగా ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ దీనిని నిర్వహిస్తుంది. పరేడ్‌కు గ్రాండ్ మార్షల్స్‌గా వ్యవహరించిన సెకండ్ టాలీవుడ్ సెలిబ్రిటీలుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వీరి కంటే ముందు 2022లో ఇండియా డే పరేడ్‌కు అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించాడు.
ట్రెడిషనల్ లుక్‌లో…
ఇండియా డే పరేడ్‌లో ఒకరి చేతిని మరొకరు పట్టుకొని చాలా క్లోజ్‌గా అభిమానులకు కనిపించారు విజయ్, రష్మిక. ఈ వేడుకల్లో ఇద్దరు ట్రెడిషనల్ డ్రెస్‌లలో మెరిశారు. విజయ్ కుర్తా పైజమా ధరించగా… రష్మిక రెడ్ కలర్ చుడీదార్‌లో కనిపించింది. విజయ్, రష్మిక ఈ పరేడ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఇండియా డే పరేడ్‌లో విజయ్, రష్మిక మందన్న పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read – GST changes: జీఎస్టీ రేట్లు సవరించడంతో వాహనాల ధరలు తగ్గే ఛాన్స్!
చూడముచ్చటగా….
చాలా రోజుల తర్వాత వీరిద్దరిని జంటగా చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. జంట చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇండియా డే పరేడ్‌తో మరోసారి వీరి ప్రేమ వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ ఈ డేటింగ్ పుకార్లపై విజయ్, రష్మిక చాలా కాలంగా సెలైంట్‌గా ఉంటున్నారు.. ఔనని, కాదని చెప్పడం లేదు. ఇటీవల రిలీజైన కింగ్డమ్ మూవీకి సంబంధించి విజయ్ దేవరకొండను ఉద్దేశించి రష్మిక మందన్న పెట్టిన ట్వీట్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
మూడో సినిమా…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి తెలుగులో డియర్ కామ్రేడ్, గీతగోవిందం సినిమాలు చేశారు. గీతగోవిందం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా… డియర్ కామ్రేడ్ యావరేజ్ రిజల్ట్‌ను సొంతం చేసుకుంది. వీరిద్దరు కలిసి ముచ్చటగా మూడోసారి జోడీ కట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారంజరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Also Read – GST Relief: జీఎస్టీ మార్పులతో మధ్యతరగతికే లాభం.. గృహోపకరణాల నుంచి సిమెంట్ వరకు రేట్ల తగ్గింపు!


