Betting App Promotions Case Vijay Devarakonda: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ చేసినందుకు గాను మంగళవారం మధ్యాహ్నం సిట్ అధికారులు విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న రెమ్యునరేషన్, కమీషన్లపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/international-news/bomb-blast-in-pakistan-20-members-died-in-spot/
కాగా, ఈ కేసులో నటుడు విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్‌కు సైతం సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రకాష్ రాజ్ విచారణకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సినీ నటులు, మాజీ క్రికెటర్లు, బుల్లి తెర స్టార్లు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్ల్యూయెనర్స్ సైతం బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలుగా ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/senior-heroine-shobana-to-play-key-role-in-ram-charan-peddi/
ఇటీవల మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు సంబంధించి రూ. 11 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులపై ఈడీ కేసులు నమోదు చేసింది. వీరి ప్రచారం కారణంగా చాలా మంది ఈ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా కుటుంబాల్లో తీరని విషాదంతో పాటు ఆర్థిక సంక్షోభం నెలకొంది.


