Sunday, May 4, 2025
Homeచిత్ర ప్రభVijay Deverakonda: ట్రైబల్స్ వివాదంపై విజయ్‌ దేవరకొండ క్లారిటీ

Vijay Deverakonda: ట్రైబల్స్ వివాదంపై విజయ్‌ దేవరకొండ క్లారిటీ

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) చేసిన ట్రైబల్ వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ట్రైబల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వివాదంపై విజయ్‌ క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

- Advertisement -

‘‘‘రెట్రో’ ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. దేశంలోని ప్రజలంతా ఒక్కటేనని భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి. నేను ఎవరిపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడడమే నా లక్ష్యం

‘‘దేశంగా ఐక్యంగా నిలబడాలని కోరుతూ మాట్లాడిన నేను వివక్ష చూపుతానా? ‘తెగ’ అనే పదాన్ని చారిత్రక, నిఘంటు కోణంలో ఉపయోగించాను. శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలుగా వ్యవస్థీకృతమై ఉండేది. ఇది షెడ్యూల్డ్ తెగల వర్గీకరణ గురించి కాదు.ఆంగ్ల నిఘంటు ప్రకారం, ‘తెగ’ అంటే: సామాజిక, ఆర్థిక, మత లేదా రక్త సంబంధాలతో ముడిపడిన కుటుంబాలు లేదా సంఘాలతో కూడిన సాంప్రదాయ సమాజంలో సామాజిక విభజన. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోబడినా లేదా బాధ కలిగించినా, హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News