Kingdom: కింగ్డమ్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన కింగ్డమ్ భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయ్‌దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్, గౌతమ్ తిన్ననూరి ట్రాక్ రికార్డ్ తో పాటు ముందునుంచి సినిమాపై ఉన్న పాజిటివ్ టాక్ కారణంగా తొలిరోజు కింగ్డమ్ రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది.
31 కోట్ల కలెక్షన్స్…
గురువారం రోజు కింగ్డ్‌మ్ మూవీ 31 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో విజయ్ దేవరకొండ గత సినిమాల రికార్డులను కింగ్డమ్ తిరగరాసింది. విజయ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో నాని హిట్ 3, దసరా తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కింగ్డమ్ నిలిచింది.
Also Read- Sravanamasam: శ్రావణ మాసంలో మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా..అయితే కచ్చితంగా వీటిని తెలుసుకోవాల్సిందే!
తెలుగు రాష్ట్రాల్లో…
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ అదరగొట్టింది. తొలిరోజు 23 కోట్ల వరకు గ్రాస్, 11.38 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో విజయ్‌కి ఉన్న పాపులారిటీ మరోసారి ఈ సినిమాకు హెల్పయ్యింది. నైజాంలో అత్యధికంగా 4.96 కోట్ల షేర్‌ను ఈ మూవీ సాధించింది. సీడెడ్‌లో 1.70 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. విజయ్ లాస్ట్ మూవీ ఖుషి… నైజాం 5.12 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. ఆ సినిమా తర్వాత సెకండ్ ప్లేస్‌లో కింగ్డమ్ నిలిచింది. కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 53 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది.
మిక్స్‌డ్ టాక్…
తొలి రోజు కింగ్డమ్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్టింగ్ బాగుందంటూ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. టెక్నికల్ బ్రిలియంట్ మూవీగా చెబుతున్నారు. కానీ సెకండాఫ్ వీక్‌గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెగెటివ్ టాక్ ఎఫెక్ట్ సెకండ్ డే కలెక్షన్స్‌పై ఎంత వరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్…
కింగ్డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో అన్నదమ్ముల సెంటిమెంట్‌కు స్పై యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను నిర్మించారు.


