Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమాను నిషేధించాలంటూ తమిళనాడులోని ఎన్‌టీకే (నామ్ తమిజార్ కట్చి) పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కింగ్డమ్ ఆడుతున్న థియేటర్ల ముందు ఎన్‌టీకే పార్టీ కార్యకర్తలు నిరసన తెలపడం ఉద్రిక్తతలకు దారితీసింది.
స్మగ్లర్లుగా చూపించారు…
కింగ్డమ్ మూవీలో తమిళ ప్రజల ఉనికి, అస్తిత్వాన్ని తక్కువ చేసి చూపించారని, స్మగ్లర్లుగా తమిళ ప్రజలను చిత్రీకరించారని ఎన్‌టీకే పార్టీ లీడర్స్ చెబుతోన్నారు. తమిళ ఈళం సిద్ధాంతాలను పూర్తిగా వక్రీకరించారని, తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు.
సినిమాను నిలిపివేయాలి…
తమిళనాడులో కింగ్డమ్ ప్రదర్శనను నిలిపివేయడమే కాకుండా ఈ సినిమాపై నిషేదాన్ని విధించాలని ఎన్‌టీకే పార్టీ డిమాండ్ చేస్తోంది. విలన్‌కు మురుగన్ అనే పేరు పెట్టడంపై కూడా ఎన్‌టీకే పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పలు చోట్ల కింగ్డమ్ పోస్టర్స్‌ను ఎన్‌టీకే కార్యకర్తలు చింపేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read – Bandhavi Sridhar: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న ‘మసూద’ బ్యూటీ, ఫోటోలు వైరల్
తమిళంలో ఆరు కోట్ల కలెక్షన్స్…
కింగ్డమ్ మూవీ తమిళనాడులో మంచి వసూళ్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లో ఆరు కోట్ల గ్రాస్, మూడున్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్‌ను దక్కించుకుంది. ఎన్‌టీకే పార్టీ నిరసనల నేపథ్యంలో కింగ్డమ్ తమిళ వెర్షన్ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.
53 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్…
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌కు అన్నదమ్ముల సెంటిమెంట్‌ను జోడించి తెరకెక్కిన ఈ మూవీ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 72 కోట్ల గ్రాస్, 33 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. 53 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టడానికి మరో పదిహేను కోట్ల వరకు రాబట్టాల్సివుంది.
సోమవారం డ్రాప్…
సోమవారం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఆదివారం నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా సోమవారం రోజు మాత్రం కేవలం 95 లక్షల లోపే వసూళ్లను దక్కించుకొని డిజపాయింట్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read – Badmashulu OTT: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ – ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్!


