Kingdom OTT: విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండకు తెలుగులో ఉన్న క్రేజ్‌తో పాటు సినిమాపై ఉన్న బజ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
రెండు రోజలు ముందే…
అయితే థియేటర్లలో కింగ్డమ్‌కు మిక్స్‌డ్ టాక్ రావడంతో అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ముందే విజయ్ దేవరకొండ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కింగ్డమ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు. థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్ లెంగ్త్ పెరగనుంది. హృదయం లోపల సాంగ్‌తో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే లవ్ ట్రాక్‌ను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేయబోతున్నారు.
Also Read- Coolie Pre Release Business : రిలీజ్‌కు ముందే రజనీ ‘కూలీ’ సెన్సేషన్..రజినీ రికార్డుల మోత
స్పై యాక్షన్ డ్రామా…
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. పదకొండు రోజుల్లో ఇండియా వైడ్‌గా 50.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 84 శాతం మేర రికవరీ సాధించింది. మరో మూడు రోజుల్లో వార్ 2తో పాటు కూలీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కింగ్డమ్ బ్రేక్ ఈవెన్‌ను సాధించడం అనుమానంగానే కనిపిస్తుంది. క్లీన్ హిట్ కోసం ఈ మూవీ 54 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాల్సివుంది. యాభై కోట్ల నెట్ కలెక్షన్స్‌లో తెలుగు వెర్షన్ వాటానే దాదాపు నలభై మూడున్నర కోట్ల వరకు ఉండటం గమనార్హం.
కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక నేపథ్యానికి అన్నదమ్ముల అనుబంధం జోడించి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని రూపొందించారు.
కింగ్డమ్ కథ ఇదే…
సూరి (విజయ్ దేవరకొండ) పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోయిన అన్న శివ (సత్యదేవ్) కోసం పద్దెనిమిదేళ్లుగా వెతుకుతుంటాడు. శ్రీలంకలోని జాఫ్నాలో ఓ స్మగ్లింగ్ గ్యాంగ్‌కు శివ నాయకుడనే నిజం సూరికి తెలుస్తుంది. అన్నను కాపాడటం కోసం స్పై గా మారి శ్రీలంక వెళ్లిన సూరికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? శ్రీలంకలో సూరికి సాయం చేసిన అను ఎవరు అన్నదే ఈ మూవీ కథ. కింగ్డమ్ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. కింగ్డమ్‌కు పార్ట్ 2ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read- MS Dhoni: మీరు ఆడాలి సార్ అన్న అభిమాని..”మరి నా కాలి నొప్పిని ఎవరు భరిస్తారని అడిగిన ధోనీ!


