Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభKingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ మూవీ విడుదల వాయిదా

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ మూవీ విడుదల వాయిదా

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా.. ‘జెర్సీ’ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’(Kingdom) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ గుండె చేయించుకుని తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన మూవీ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మే 30న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే తాజాగా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

“దేశంలో ఇటీవల జరిగిన ఊహించని సంఘటనలు, ప్రస్తుత వాతావరణం కారణంగా ప్రమోషన్స్, వేడుకలకు చాలా కష్టం అవుతుంది. మీ మద్దతును మేము నిజంగా విలువైనదిగా భావిస్తున్నాము. అలాగే మీ ప్రేమను అందుకుంటామని ఆశిస్తున్నాము. అలాగే తమకు మద్దతును ఇచ్చినందుకు దిల్ రాజు, నితిన్ గార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.. జై హింద్’’ అని రాసుకొచ్చారు. జూలై 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనన్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad