Kingdom Collections: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ మూవీ ‘కింగ్డమ్. ఈ చిత్రం తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టుకుంది. రెండో రోజున మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేవని ట్రేడ్ వర్గాలంటున్నాయి. చాలా ఏరియాల్లో ఆక్యుపెన్సీ పర్సంటేజ్ తగ్గింది. అయితే మేకర్స్ మాత్రం కింగ్డమ్ మూవీ రెండు రోజుల్లో రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ప్రకటించింది. కానీ సినీ సర్కిల్స్ సమాచారం మేరకు ఈ కలెక్షన్స్ రెండు రోజులకు రూ.47 కోట్లు మాత్రమే వచ్చాయి.
తొలి రోజున కింగ్డమ్ (Kingdom Collections) మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజున సగానికి పైగానే డ్రాప్ అయ్యింది. సెకండ్ డే మాత్రమే రూ.14 కోట్లు మాత్రమే వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజున మూవీ వసూళ్లను గమనిస్తే..
Also Read – Trisha: విడాకులు తీసుకునే పెళ్లి నాకొద్దు – త్రిష కామెంట్స్ వైరల్…
నైజాం – రూ.2.15 కోట్లు
సీడెడ్ – రూ. 78 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 49 లక్షలు
ఈస్ట్ – రూ. 29 లక్షలు
వెస్ట్ – రూ. 21 లక్షలు
గుంటూరు – రూ. 26 లక్షలు
కృష్ణా – రూ. 24 లక్షలు
నెల్లూరు – రూ. 16 లక్షలు
వచ్చాయి. మొత్తంగా చూస్తే రూ. 4.58 కోట్లు షేర్ (రూ.7.55 గ్రాస్) కలెక్షన్స్ సాధించిందని టాక్. రెండు రోజులకు కలిపి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.92 కోట్లు షేర్ (రూ.26.35 కోట్లు గ్రాస్) కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.2.35 కోట్లు రాగా, ఓవర్ సీస్‌లో రూ.6.80 కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా చూస్తే ఇది రూ.25.07 కోట్లు షేర్ (రూ.47.30 కోట్లు గ్రాస్) కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సర్కిల్స్ సమాచారం. కానీ మేకర్స్ ఏరియాల వారీగా కలెక్షన్స్ చెప్పకుండా టోటల్ కలెక్షన్స్ మాత్రమే చెప్పారు.
Also Read – OG Fire Storm Song Review: పగ రగిలిన ఫైరూ.. తమన్‌కు బిర్యానీ పక్కా!
కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 52.50 కోట్లు చేసింది. అంటే రూ.53 కోట్ల షేర్ కలెక్షన్స్ మార్క్ దాటితేనే మూవీ హిట్ అయినట్లు. ఈ లెక్కన ఆ మొత్తంలో చూస్తే సినిమా ఇంకా దాదాపు రూ.28 కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది. మరి శని, ఆది వారాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.


