Kingdom Movie: లైగర్ డిజాస్టర్ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ మూవీ కోసం ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ రెండింటిలో ముందుగా కింగ్డమ్ మూవీ రానుంది. రెండు, మూడు రోజుల ముందు వరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇన్నాళ్లు క్లారిటీ లేదు. అయితే ఎట్టకేలకు మేకర్స్ జూలై 31న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను ఎప్పటి నుంచో రిలీజ్ చేయటానికి ప్లానింగ్ చేసుకుంటున్నాడు కానీ.. సినిమా ఔట్‌పుట్ విషయంలో శాటిస్పాక్షన్ లేకపోవటంతో రీ షూటింగ్స్ చేస్తూ వచ్చారు. దీని వల్ల అనుకున్న రిలీజ్ ఏది ఫైనల్ కాలేదు.
ఒకానొక సందర్భంలో జూలై 25న కింగ్డమ్ సినిమాను విడుదల చేయాలని నాగవంశీ భావించారు. అయితే అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా లైన్‌లోకి రావటం, జూలై 24 అని రిలీజ్ డేట్ ప్రకటించటంతో మళ్లీ కింగ్డమ్‌ను వాయిదా వేస్తారా లేదా? అనే ప్రశ్న అందరికీ వచ్చింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయనే న్యూస్ కూడా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే పవన్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే సూర్యదేవర నాగవంశీ తన కింగ్డమ్ సినిమాను వాయిదా వేసుకున్నారు. లేటెస్ట్‌గా జూలై 31న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read- Saipallavi ramayanam movie: సాయి పల్లవిపై ట్రోల్స్: అనవసర ఆరోపణలను ఖండిస్తున్న అభిమానులు
ఎప్పుడైతే విజయ్ దేవరకొండ తన సినిమాను జూలై 31న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడో.. ఇండస్ట్రీ హిట్ డేట్‌ను పట్టేశాడని అంటున్నారు కొందరు. సినీ ఇండస్ట్రీలో ఆ రోజున అంటే జూలై 31న సినిమాలన్నీ భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. 1964లో సీనియర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన అగ్గిపిడుగు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. తర్వాత 1987లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రాము సినిమా రిలీజైంది. ఆ సినిమా కూడా ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన చిత్రం మగధీర కూడా జూలై 31నే వచ్చింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది.
ఇప్పుడు అలాంటి లక్కీ డేట్ జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో రానుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇద్దరికీ హిట్ అవసరం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇటు విజయ్ దేవరకొండకు, అటు గౌతమ్ తిన్ననూరికి ఎంతో కీలకం. మరి లక్కీ డేట్ విజయ్ దేవరకొండకు ఏ మేరకు కలిసొస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


