Kingdom Theatrical Business: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కళ్లన్నీ ‘కింగ్డమ్’ మీదనే ఉన్నాయి. జూలై 31న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. రౌడీ స్టార్ సైతం ఈ మూవీపై భారీ నమ్మకాన్నే పెట్టుకున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ స్టూడియోస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండకు మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చాటుకునే రేంజ్ మూవీ రాలేదు. ఖుషి పరావాలేదనిపించుకుంది. ఫ్యామిలీస్టార్ మూవీ అయితే డిజాస్టర్ అయ్యింది. దీంతో విజయ్ కాస్త బ్రేక్ తీసుకుని ‘కింగ్డమ్’ మీదనే ఫోకస్ పెట్టి మరీ ఈ సినిమా చేశాడు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
రీసెంట్‌గా రిలీజైన ‘కింగ్డమ్’ ట్రైలర్ (Kingdom Trailer) అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే రా అండ్ రగ్డ్ లుక్‌లో విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటున్నాడు. ఓ వర్గం కోసం పోరాడే నాయకుడు వివరాలను తెలుసుకునే స్పై పోలీస్ ఆఫీసర్ పాత్రలో రౌడీ స్టార్ కనిపించబోతున్నాడు. ఈ విషయాలన్నీ ట్రైలర్‌లోనే తెలిశాయి.
రూ.100 కోట్లు టార్గెట్‌గా…
సినిమాపై పెరిగిన అంచనాలతో థియేట్రికల్ బిజినెస్ బాగానే అయ్యింది. ఏకంగా రూ.100 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు నైజాంలో రూ.15 కోట్లు, ఆంధ్ర రూ.15 కోట్లు, సీడెడ్ రూ.6 కోట్లు, ఓవర్సీస్ రూ.10 కోట్లు, డబ్బింగ్ వెర్షన్ ఇతరత్రా కలిపి రూ.4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే టోటల్‌గా రూ.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే సినిమా హిట్ కావాలంటే రూ.51 కోట్లు షేర్ రావాలి. అంటే రూ.100 కోట్లు కంటే ఎక్కువగా గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టాలి. మరి విజయ్ దేవరకొండకు ఆ రేంజ్ హిట్ వస్తుందా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/actress-samantha-deadhang-challenge-video-goes-viral/
అన్నదమ్ముల కథతో..
‘కింగ్డమ్’ మెయిన్ పాయింట్ బ్రదర్ సెంటిమెంట్. ఇందులో విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలో విలక్షణ నటుడు సత్యదేవ్ నటించాడు. తన పాత్ర శ్రీలంక లాంటి ప్రాంతంలోని ప్రజల నాయకుడిని పోలి ఉంది. తన లక్ష్యం కోసం ఎంతో మందిని బలి తీసుకున్న నరరూప రాక్షసుడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తాడు. అతన్ని పట్టుకోవటానికే విజయ్ దేవరకొండ ఆ ప్రాంతానికి వస్తాడు. ముందు తన అన్నే అక్కడ నాయకుడని హీరోకి తెలియదు. తెలిసిన తర్వాత ఏమవుతుందనేదే కథ. హీరో ఎంతగానో ప్రేమించి అన్నయ్య.. నరరూప రాక్షసుడిగా ఎందుకు మారాడు? చివరకు హీరో అనయ్యను పట్టుకున్నాడా? అనేది పాయింట్. దీన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎలా తెరకెక్కించాడనేదే అందరిలోనూ ఆసక్తిని పెంచుతోన్న విషయం.
జెర్సీ తర్వాత..
జెర్సీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి నెక్ట్స్ మూవీగా వస్తోన్న ‘కింగ్డమ్’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొడితే దర్శకుడిగా గౌతమ్ టాప్ లీగ్‌లోకి చేరుతాడనటంలో సందేహం లేదు. ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయితే సినిమాతో హిట్ కొట్టిసినట్టేనని చెబుతున్నాడు. ఔట్‌పుట్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా రీషూట్స్ కూడా చేశారు.
హీరోయిన్‌కి కూడా కీలకమే..
మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటించిన సినిమా ఇది. ఆమె ఖాతాలో చాలా సినిమాలే ఉన్నప్పటికీ ఆమె రెండో సినిమాగా ఇది రిలీజ్ అవుతుంది. దీంతో ఎలాగైనా హిట్ కొడితే స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పొచ్చునని అమ్మడు భావిస్తోంది. మరి అమ్మడి కోరిక ఏమేరకు నిజమవుతుందో చూడాలి మరి.


