Rashmika – Vijay Devarakonda: లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకే వేదికపై జంటగా తెలుగు ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న చేసిన ఈ ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లో 11 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువలో ఉంది. మంగళవారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
గర్ల్‌ఫ్రెండ్ మూవీని మంగళవారం హైదరాబాద్‌లో అభిమానులతో కలిసి రష్మిక మందన్న చూడబోతుందట. ఇన్నాళ్లు కాక్‌టెయిల్ 2 షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ఈ సినిమాను చూడలేదట రష్మిక. అంతే కాకుండా ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారట. బుధవారం హైదరాబాద్‌లో ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్ జరుగబోతుంది. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నాడు. ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండను గెస్ట్‌గా తీసుకురాబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. కానీ రష్మిక బిజీ షెడ్యూల్స్‌తో పాటు విజయ్ రౌడీ జనార్ధన షూట్‌లో బిజీగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మిస్సయినా సక్సెస్ మీట్‌కు విజయ్‌ని తీసుకురాబోతున్నారట.
Also Read – The Rajasaab: పండగకు వస్తున్నాం.. పండగ చేస్తున్నాం.. ‘ది రాజా సాబ్’ నిర్మాత ఎస్.కె.ఎన్ కామెంట్స్
గత నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ రూమర్ల తర్వాత ఫస్ట్ టైమ్ విజయ్, రష్మిక ఒకే వేదికపై కనిపించబోతుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. తమ ఎంగేజ్‌మెంట్‌తో పాటు పెళ్లిని ఇద్దరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో ఈ సక్సెస్‌మీట్ కోసం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి డేట్ కూడా ఖరారైందని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయర్‌పూర్‌లో వీరిద్దరి వివాహం జరుగనున్నట్లు చెబుతోన్నారు. పెళ్లి డేట్‌ను విజయ్, రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్‌లో అనౌన్స్ చేస్తారో లేదో చూడాల్సిందే.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. నవంబర్ నెలాఖరున మొదలయ్యే నెక్స్ట్ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
Also Read – Dharmendra: ఇది క్షమించరాని నేరం.. ఫైర్ అయిన హేమా మాలిని, ఈషా డియోల్


