Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRowdy Janrdhan: ఫ్లాప్ ప్రొడ్యూస‌ర్‌తో మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా.. డేట్ ఫిక్స్‌

Rowdy Janrdhan: ఫ్లాప్ ప్రొడ్యూస‌ర్‌తో మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా.. డేట్ ఫిక్స్‌

Rowdy Janardhan: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన్’కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడేళ్లుగా సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క‌యితే న‌డుస్తోంది. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రవి కిరణ్ కోలా ఇంతకు ముందు ‘రాజా వారు రాణి గారు’ (2019), ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ (2022) వంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ డ్రామాలను తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

తర్వాత ఆశిష్ హీరోగా చేసిన ర‌వి కిర‌ణ్ కోలా చేసిన‌ రౌడీ స్టార్ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే మూడేళ్లుగా రౌడీ జ‌నార్ధ‌న్‌పై వ‌ర్క్ చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా ఇంటెన్స్ పీరియాడిక్ యాక్ష‌న్‌ డ్రామాగా ఇది తెర‌కెక్క‌బోతుంది. ‘ఒక కల్పిత పాత్రను బయోపిక్ ఫార్మేట్లో చెబితే ఎలా ఉంటుంది? అదే రౌడీ జనార్దన్ అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని అక్టోబర్ 11న హైదరాబాద్‌లో లాంచ్ చేయ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 16 నుంచి ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌బోతుంది. హీరోయిన్ ఎవ‌ర‌నేది అధికారికంగా క‌న్‌ఫర్మ్ కాలేదు. అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ మూవీలో కీర్తి సురేష్ (Keerthy Suresh) క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. విజ‌య్, కీర్తి కలిసి న‌టిస్తోన్న తొలి సినిమా ఇదే అవుతుంది.

Also Read – MBU Controversy: మోహ‌న్‌బాబుకి షాక్‌.. యూనివ‌ర్సిటీ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని సిఫార్స్‌

మ‌రో వైపు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రాయ‌ల‌సీమ పీరియాడిక్ డ్రామా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. రెండు సినిమాల‌ను ప్లానింగ్ ప్రకారం కంప్లీట్ చేయాల‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ భావిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో రౌడీ స్టార్ చేస్తోన్న రెండో సినిమా ఇది. ఫ్యామిలీ స్టార్ ఊహించ‌ని రీతిలో ప‌రాజయం పాలైంది. అయితే ఈసారి రౌడీ జనార్ధ‌న్‌తో కాంబోలో హిట్ రావాల‌ని దిల్ రాజు నిశ్చ‌యంతో ఉన్నాడు. అందుక‌నే స‌మ‌యం తీసుకున్నా.. సినిమా స్క్రిప్ట్ ఓకే అనుకున్న త‌ర్వాతే సెట్స్ పైకి వెళుతున్నారు.

వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ విజయ్ దేవరకొండకు రాబోయే సంవత్సరం ఒక ట్రీట్ కానుంది. ఇటీవల ఆయన రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెల‌సిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

Also Read – Heavy traffic: ఎన్‌హెచ్-19పై 4 రోజులుగా నిలిచిపోయిన వాహనాలు.. ఆకలిదప్పులతో అలమటిస్తున్న డ్రైవర్లు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad