Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడం టాలీవుడ్ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకోవడానికి ఆదివారం పుట్టపర్తి వెళ్లారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌కు తిరుగుప్రయాణంలో విజయ్ ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద ప్రమాదానికి గురైంది. విజయ్ కారును ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ క్షేమంగా బయటపడ్డారు. కానీ విజయ్ కారు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. తన స్నేహితుడి కారులో విజయ్ హైదరాబాద్‌కు వచ్చేశారు.
సేఫ్‌గా ఉన్నా…
కారు ప్రమాదం తర్వాత విజయ్ క్షేమసమాచారాలపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అతడికి ఏమైందోనని టెన్షన్ పడుతూ ట్వీట్స్, పోస్ట్‌లు పెట్టారు. తాను సేఫ్‌గా ఉన్నానని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నాకు ఏం కాలేదు. అంతా బాగానే ఉంది. కానీ కారు మాత్రం డ్యామేజీ అయ్యింది. ఇంటికి చేరుకున్నాను. వర్కవుట్ కూడా చేశాను. కాస్త తలనొప్పిగా ఉంది. మంచి బిర్యానీ, నిద్రతో అన్ని సెట్ అవుతాయి. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు అంటూ ట్వీట్ చేశాడు.
Also Read – MITHRA MANDALI TRAILER: మ్యాడ్‌నెస్ షురూ, మరొక MAD లాంటి సినిమా రిలీజ్ కి రెడీ
ఐరెన్ లెగ్….
ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఎంగేజ్‌మెంట్ జరిగిన రెండు, మూడు రోజుల తర్వాతే ప్రమాదం జరగడంతో రష్మికది ఐరెన్ లెగ్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం రష్మికకు సపోర్ట్ చేస్తున్నారు. రష్మిక వల్లే పెద్ద ప్రమాదం నుంచి విజయ్ క్షేమంగా బయటపడ్డాడని అంటున్నారు. ఈ ప్రమాదంతో విజయ్, రష్మికలపై ఉన్న దిష్టి మొత్తం పోయిందని పేర్కొంటున్నారు. నెటిజన్ల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
హ్యాట్రిక్ మూవీ…
విజయ్, దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరిలో జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా వీరిద్దరు కలిసి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
బాలీవుడ్‌లో బిజీ…
రాహుల్ సాంకృత్యాన్ మూవీతో పాటు తెలుగులో రౌడీ జనార్ధన సినిమా చేస్తోన్నాడు విజయ్ దేవరకొండ. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
మరోవైపు తెలుగుతో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న. బాలీవుడ్‌లో థామాతో పాటు కాక్‌టెయిల్ 2 సినిమాలు చేస్తోంది. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతో రూపొందుతున్న ది గర్ల్‌ఫ్రెండ్, మైసా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read – Children Height: మీ పిల్లలు స్పీడ్ గా హైట్ పెరగాలంటే.. ఈ కూరగాయలు పెట్టండి!


