Vijay- Rashmika Engaged: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమ కథకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఈ లవ్ బర్డ్స్ ఈ రోజు శుక్రవారం అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నట్లు విజయ్ సన్నిహుతులు తెలిపారు. మరి కొద్ది నెలల్లో ఓ ఫేమస్ డెస్టినేషన్ స్పాట్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
కొంతకాలంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది విజయ్, రష్మికల పెళ్లి వార్తలు. ఇప్పటివరకూ తమ రిలేషన్ గురించి మీడియా ఎదుట మాట్లాడని ఈ లవ్ జంట.. ఈ రోజు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని విజయ్ ఇంట్లో అతి కొద్ది మంది కుటుంబీకుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు విజయ్ సన్నిహితులు తెలిపారు. 2026 ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
Also Read: https://teluguprabha.net/cinema-news/raviteja-kishorea-tirumala-rt-76-title-fixed/
‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించిన ఈ జోడీ.. ఆడియన్స్‌కు ఫేవరెట్. వీరి ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్ డియర్ కామ్రేడ్‌లో బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ జోడీ రియల్ లైఫ్‌లో వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతుండటంతో సోషల్ మీడియాలో వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, వీరి ఎంగేజ్‌మెంట్‌తో అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు.


